ఏపీలో ఎన్నికలొస్తే ఎవరు గెలుస్తారంటే…



Want create site? Find Free WordPress Themes and plugins.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని విజయం వరిస్తోంది. సి.ఎం. లైన చంద్రులిద్దరు తిరిగి అధికారంలోకి వస్తారా.. విపక్షాల పాత్ర ఎంత. వాస్తవ పరిస్థితి ఏంటనే విషయం పై పలు సర్వేలు వస్తున్నాయి. మెజార్టీ సర్వేలన్నీ వారిదే తిరిగి అధికారమని చెప్పేస్తున్నాయి. అదే సమయంలో వైకాపా, జనసేనలను ప్రస్తావిస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవార్డును అందుకుని మంచి జోరుమీద ఉన్నాడు. గతం కంటే తన గ్రాఫ్ ను పవన్ పెంచుకుంటున్నాడు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ ఇమేజ్ మరింత పెరుగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. అయినా ఇంటా బయట ఇబ్బందులు వస్తున్నాయి. 
                        ప్ర‌జ‌లు ఏ లీడ‌ర్‌కి మ‌ద్ద‌తిస్తున్నారు…? ఏ పార్టీకి ఎన్నిక‌ల‌లో ఓట్ల శాతం ద‌క్కనుంది..? అనే అంశాల‌ పై జిల్లాల వారీగా ఓ సంస్థ స‌ర్వేలు నిర్వ‌హించింద‌ట‌. ప్ర‌ముఖ సెఫాల‌జిస్ట్ ఈ స‌ర్వేని చేశార‌ని సమాచారం. గ‌త ఎన్నిక‌ల‌లోనూ ఆయ‌న చేసిన స‌ర్వే దాదాపు నిజమైందని ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎవరి బలా బలాలు ఏంటో తెలుసుకుందాం. 
                        టీడీపీకి 42-43 శాతం ఓట్లు వస్తాయట. విపక్ష పార్టీ వైఎస్సార్‌సీకి 33-34 శాతం ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతార‌ట‌. 2014 ఎన్నిక‌ల‌లో రెండు పార్టీల మ‌ధ్య ఉన్న ఓట్ బ్యాంక్ తేడా 1 శాతం. కానీ ఈ సారి అది 7 నుంచి 8 శాతం పెరుగుతుందట. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఏపీలో 2-3 శాతం ఓటింగ్ ఉంద‌ని తెలంగాణ సి.ఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతకు మించి జ‌న‌సేన‌కు ఓట్లు ప‌డ‌నున్నాయ‌ట‌. ఏకంగా 12 నుంచి 14 శాతం ప్ర‌జ‌లు ఆయ‌నకు ఓటేయ‌నున్నార‌ని తెలుస్తోంది. టీడీపీకి ఫుల్ మెజారిటీ రాకపోతే జ‌న‌సేన కింగ్ మేకర్ అవుతుందట. ఇప్పుడీ విషయం జనాల్లో చర్చనీయాంశమైంది. రోజు రోజుకు జనసేన పార్టీ ప్రజల్లోకి వెళుతుందట. అదే సమయంలో సీరియస్ రాజకీయాల వైపు పవన్ దృష్టి పెట్టకపోవడంతో ఆయన ఏం చేస్తాడోనన్న ఉత్కంఠ నెలకుంది. 
                       సి.ఎంగా చంద్రబాబు తిరిగి ఎన్నికవుతాడని ఆ సర్వే చెప్పే సారాంశం. గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ప్రజలు టీడీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారట. అందులో మహిళలు ఆ పార్టీని అభిమానిస్తుండగా…. యూత్ లో పవన్ కు క్రేజ్ ఉందట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*