నారా, కొణిదెల కోడళ్లు క‌లిస్తే…



Want create site? Find Free WordPress Themes and plugins.
 
       అరుదైన కలయిక. నారా, కొణిదెల వారి కోడళ్లు కలిశారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. నారా కుటుంబానికి నందమూరి అమ్మాయి బ్రాహ్మాణి వెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ కుటుంబానికి ఉపాసన వెళ్లింది. ఇటు ఉపాసన, అటు బ్రాహ్మణిలు ఇద్దరు కలిసున్న ఫోటో ఇంత వరకు రాలేదు. ఈ ఫోటోను బాల‌య్య ఫ్యాన్స్ విప‌రీతంగా షేర్స్ చేస్తున్నారు. ఈ పొటోలో ఉన్న‌ది చంద్రబాబు కోడలు బ్రాహ్మ‌ణి…చిరంజీవి కోడ‌లు ఉపాస‌న‌. నంది అవార్డుల వివాదంతో మెగా, నందమూరి కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతుంది. కానీ అది నిజం కాదని వారిద్దరు కలిసి చెబుతున్నారు. ఆ రెండు కుటుంబాలకు చెందిన ఈ ఇద్ద‌రు కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా పేజ్ లో తాను తీసిన ఫోటోను పోస్ట్ చేసింది. రక్తదాన శిబిరంలో ఉపాసన, బ్రాహ్మణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ఉపాసన.. 18 ఏళ్ల వయసులో రక్తదానం చేయటం ప్రారంభిస్తే ప్రతీ 90 రోజులకు ఒకసారి చొప్పున 60 ఏళ్ల వరకు చేయవచ్చు. దాదాపు 500 మంది ప్రాణాలను కాపాడవచ్చు అని కామెంట్ చేసింది. ఇద్ద‌రూ సినీ ప‌రిశ్ర‌మకు చెందిన కుటుంబాల నుండి వ‌చ్చిన వారే కావడం విశేషం. ఇద్ద‌రూ చిన్న వ‌య‌సులోనే వ్యాపార రంగంలో రాణిస్తు న్నారు. పైగా సోష‌ల్ స‌ర్వీసులోనూ ఆస‌క్తులు కలిశాయి. అందుకే ఈ పోస్టింగ్ కు మంచి ఫాలోయింగ్ క‌నిపిస్తోంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*