తనకు రక్షణ కల్పించాలన్న కేతిరెడ్డి



Want create site? Find Free WordPress Themes and plugins.
         ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమా యూనిట్‌ కి లక్ష్మీ పార్వతి నుంచి ప్రాణ హాని ఉంది. రక్షణ కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబును ఆ సినిమా డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఏపీ సచివాలయానికి వెళ్లిన కేతిరెడ్డి ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి తన సినిమా గురించి చర్చించారు. తాను నిర్మిస్తున్న సినిమాకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని..అదే సమయంలో తమకు రక్షణ కల్పించాలని ఆయన సి.ఎంను అడిగారు. తన అభ్యర్థనకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ‘లక్మీస్ వీరగ్రంధం’పై కొంతకాలంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మీపార్వతి మధ్య మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. 
      ఇప్పుడు తమిళనాడు తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సీఎం చంద్రబాబును కలవడంపై ఉత్కంఠ నెలకొంది. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోక ముందు ఏం చేసింది. తన తొలి భర్త వీరగంధం సుబ్బారావుతో హరికథలకు వెళ్లడం దగ్గర నుంచి ఎన్టీఆర్ భార్యగా అడుగు పెట్టడం వరకు ఉన్న కథలను ఇందులో చూపించనున్నారు. తన అనుమతి లేకుండా సినిమా చూపిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని మరోవైపు లక్ష్మీపార్వతి హెచ్చరించారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*