కమ్మవారి చరిత్ర వక్రీకరణ Want create site? Find Free WordPress Themes and plugins.
        రుద్రమదేవి చిత్రం తీసిన దర్శకుడు, అందులో ఉన్న చరిత్ర వక్రీకరణ జరిగిందనేది వాస్తవం. అది పూర్తిగా తెలుసుకోకుండా ఒక సామాజిక వర్గాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది. అందుకే ఇప్పుడు పాఠకులు దాని పై స్పందిస్తున్నారు. వారి మాటల్లోనే ఇది చూడండి…
        కాకతీయ సామ్రాజ్య చరిత్ర పై పూర్తి అవగాహన లేకుండా రుద్రమదేవి సినిమా తీసిన దర్శకుడికి అవార్డుల ప్రస్తావన ఎందుకో???? – “ఉయ్యాలవాడ నరసింహరెడ్డి” సినిమాతో రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి చరిత్రపై తెలుగు సినీ దర్శకుల కుట్ర????……… 
         రుద్రమదేవి సినిమాలో గణపతి దేవుడు, రుద్రమ పాత్రలు వీరత్వం లేనివిగా చూపించారు. గోనగన్నారెడ్డి పాత్రకు అథిక ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు. సినిమాకు గోనగన్నారెడ్డి అన్న టైటిల్ ఐతే బాగుండేది. ఇది కాకతీయ కమ్మదుర్జయ సామ్రాజ్య ఖ్యాతిని ఏమాత్రం చూపించని సినిమా. నిడదవోలు చాణక్య వీరభద్రుడిగా దగ్గుబాటి రాణా కూడా బాగా నటించాడు. గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు లాంటి పాత్రలను చూపించిన దర్శకుడు కాకతీయ గజ సైన్యాధ్యక్షుడు కమ్మనాటి దుర్జయ వీరుడైన జాయప నాయుడిని, రుద్రమదేవి అంగరక్షకులైన ఇతర దుర్జయ వంశ వీరుల శౌర్యపరాక్రమాలను చూపించడంలో విఫలమయ్యాడు. చరిత్రపై అవగాహన లేని ఇటువంటి దర్శకులకి అవార్డుల ప్రస్తావన అనవసరం. ఈ చిత్రం కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన అల్లు అర్జున్, గుణశేఖర్ ప్రతిభను చూపించుకోవడానికి తీసిన చిత్రంగానే పరిగణించొచ్చు. కాని ఇందులో ఎటువంటి లోతైన చారిత్రక అంశాలు లేవు. ఇక అవార్డుల ప్రస్తావన పూర్తిగా అనవసరం.
         బందిపోటు, దోపిడీ దొంగలపై సినిమాలు తియ్యాలనుకొంటే వారిమీదనే డైరక్టుగా తియ్యాలి గాని, దానికి వీరనారి రాణి రుద్రమ దేవి పేరును వాడుకోవడం ఎందుకు???…. ఇటువంటి సినిమాలు తీసి చరిత్ర వక్రీకరించొద్దని ఆ దర్శకునికి నా మనవి… 
       మళ్ళీ ఇప్పుడు ఉయ్యాలవాడనరసింహారెడ్డి సినిమాతో ఇదే తప్పు చేస్తున్నారు. అమరావతి ప్రభువు శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి చరిత్రను వక్రీకరిస్తున్నారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా అమరావతి ప్రభువు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి గారి చరిత్ర వక్రీకరణ బ్రిటిషర్లను ఎదిరించి తెలుగువారి ఆత్మాభిమానాన్ని అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా చాటిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారైతే, రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని వికృత ప్రచారం చేస్తున్నారు. ఇకనైనా కమ్మవారి చరిత్రలపై వక్రీకరణలను ఆపడానికి అందరూ ముందుకు కదలి ఐకమత్యంగా పోరాడి మన యదార్థ చరిత్రలను రక్షించుకోవాలని నా మనవి…. 
         లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మీద ఇంత హంగామా చేసే వారు, ఇవేమీ పట్టించుకోరు. ఇదీ మన దౌర్భాగ్యం. ఇలా ఐతే మనం భవిష్యత్తులో చరిత్ర హీనులమవుతాం..సినీ దర్శకులు పూర్తి చారిత్రక అవగాహనతో సినిమాలు తీస్తే మంచిది…. 
మీ…
ముళ్ళపూడి రవిచంద్రనాథచౌదరి @ కమ్మవారి చారిత్రక పరిరక్షణ సాధనా సమితి, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్…..Mobile (9182978173) & వాట్సప్ (09959002050). 
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

Leave a Reply

Your email address will not be published.


*