మిస్ వరల్డ్ గా భారతీయ యువతి



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రపంచ సుందరిగా భారతీయ యువతి మానుషి చిల్లార్‌ విజయం సాధించింది. ప్రపంచ కిరీటం సొంతం చేసుకుంది. చైనాలోని సన్యా సిటీ ఎరీనా ప్రాంతంలో జరిగిన మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పలు దేశాలకు చెందిన 118 మంది అందాల భామలు పోటీపడ్డారు. మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫైనల్‌ పోటీలను నిర్వహించారు. హరియాణాకు చెందిన 21ఏళ్ల వైద్య విద్యార్థిని చిల్లార్‌ గ్రాండ్‌ ఫైనల్‌లో అందరినీ వెనక్కి నెట్టేసింది. విజేతగా నిలిచింది. మొదటి రన్నరప్‌గా మెక్సికోకి చెందిన ఆండ్రియా మేజా నిలవగా.. రెండో రన్నరప్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన స్టీఫెనీ హిల్‌ నిలిచింది. 
                    2000లో బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా మిస్‌వరల్డ్‌గా నిలిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని భారత్‌కు చెందిన చిల్లార్‌ దక్కించుకోవడం విశేషం. మిస్ వరల్డ్ 2017గా నిలవడంతో 20 ఏళ్ల మానుషి చిల్లర్ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగిపోతోంది.
చిల్లర్ గురించి కొన్ని సంగతులు
భారత్ నుంచి వైద్య విద్యార్థిగా మిస్ వరల్డ్ పోటీల్లో గెలుపొందిన రెండో యువతి మానుషి. ఆమె కంటే ముందు రీటా ఫారియా (1966లో) చివరి సంవత్సరం వైద్య విద్యార్థిగా ఉండగానే మిస్ వరల్డ్‌ పోటీల్లో గెలుపొందారు.
                     మానుషి తల్లిదండ్రులు మిత్రా మసు చిల్లార్, నిలీమా చిల్లార్ ఇద్దరూ డాక్టర్లే. గతేడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె ఒక విద్యా సంవత్సరానికి దూరమయ్యారు. మిస్ ఇండియా కిరిటీం గెలుచుకున్నప్పటి నుంచి ‘ప్రాజెక్టు శక్తి’లో భాగంగా మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
అభిరుచులు
ఈ ఏడాది జరిగినవి 67వ మిస్ వరల్డ్ పోటీలు
స్కెచింగ్, పేయింటింగ్ మానుషి ఇష్టమైన వ్యాపకాలు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్ 
స్కూబాడైవింగ్, బంగీజంప్‌లంటే కూడా ఆమెకు చాలా ఇష్టం.
మిస్ వరల్డ్ కిరీటం గెలవడం ఆమె చిన్ననాటి కోరిక. చాలా ఇంటర్య్వూల్లో ఆమె ఈ విషయం చెప్పారు. స్కూల్, కాలేజీ స్థాయిల్లోనూ అనేక అందాల పోటీల్లో మానుషి విజేతగా నిలిచారు.
మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న 6వ భారతీయురాలు మానుషి.
చైనా దీవి హైనన్‌లోని సన్యా నగరంలో ఈ ఏడాది ప్రపంచ సుందరి ఎంపికకు తుది పోటీ జరిగింది
భారత ప్రపంచ సుందరీమణులు వీరే..
1951 లో బ్రిటన్‌కు చెందిన ఎరిక్ మెర్లే ఈ పోటీలకు రూపకల్పన చేశారు. అదే ఏడాది జులై 29న మొదటిసారి లండన్‌లో పోటీలు నిర్వహించారు. మొట్టమొదటి ప్రపంచ సుందరిగా స్వీడన్‌కు చెందిన కికి హకన్సన్ నిలిచారు.
ఈ పోటీలు మొదలైన 15 ఏళ్ల తర్వాత భారతీయ యువతి తొలిసారి ఈ కిరీటాన్ని గెలుపొందారు.
ఇప్పటివరకు ఆరుగురు భారతీయ యువతులు మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.
1966లో రీటా ఫారియా మొదటిసారిగా ప్రపంచ సుందరిగా నిలిచారు.
ఆ తర్వాత చాలా ఏళ్లకు ఐశ్వర్యరాయ్ 1994లో మిస్ వరల్డ్‌గా నిలిచారు.
1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా నిలిచారు.
17 ఏళ్ల తర్వాత 2017 మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ భారత్‌కు చెందిన మానుషి చిల్లర్ సొంతం చేసుకున్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*