జగన్ ఫొటోతో అసలు సంగతి తెలిసిందే…



Want create site? Find Free WordPress Themes and plugins.
నేనే ముఖ్యమంత్రి. విపక్ష పార్టీ అధినేత జగన్మోహన రెడ్డి పదే పదే చెప్పే మాట ఇది. నేను అధికారంలోకి వస్తే అది చేస్తాను. ఇది చేస్తాను. అప్పటి వరకు ఆగండి. ఇంకా కొద్ది సమయమే ఉందని చెబుతూ వస్తున్నాడు. అసలు చంద్రబాబు ప్రభుత్వం పూర్తి కాలం ఉండదని చెప్పాడు గతంలో. కానీ ఇప్పుడు ఆ మాట మాట్లాడటం లేదు. ఎందుకంటే జగన్ పార్టీ నుంచే 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్లారు. ఫలితంగా వైకాపాకు ఇబ్బందిగా మారింది. జగన్ ఇప్పుడు కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి పాదయాత్ర చేసి కోవెలకుంట్లకు చేరారు. జగన్, ఒక పొలంలో, మోటార్ నుంచి వస్తున్న నీళ్ళు తాగుతున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. 
                         సి.ఎం చంద్రబాబు పాలనలో పచ్చటి పోలాలు. బోరు బావి నుంచి నీరు. ఆ నీరు చూసి పులకించి పోయిన జగన్. అంతే టీడీపీ పాలనకు అద్దం పట్టేలా ఉంది ఈ ఫొటో. కాకపోతే ఇది షేర్ చేసి జగన్ టీమ్ మంచి పని చేసింది. సస్యశ్యామలం అవుతున్న రాయలసీమ ఎలా ఉందో ఈ ఒక్క ఫొటోతో అర్థమవుతోంది. గతంలో మోడు వారిన బతుకులు  ఉండేవి. ఇప్పుడు అలా కాదు. అంత పంట పొలాలతో రైతులంతా ఆనందంగా ఉన్నారని చెబుతోందీ ఫొటో. 
                       పీకే టీమ్ ఎంతటి సింపుల్ మ్యాన్ జగన్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. జగన్ భార్య.. భారతి తన ట్విట్టర్ లో, ఈ ఒక్క ఫొటో చాలు జగన్ అంటే ఏంటో చెప్పటానికి అని ట్వీట్ చేశారు. ఇందులో పెద్ద లాజిక్ మర్చిపోయారు. చంద్రబాబు చేస్తున్న మంచిని పొగిడారు…. జగన్ నీళ్ళు తాగుతుంది పక్కన పెడితే, ఆ ఒక్క ఫొటోలో చంద్రబాబు ప్రభుత్వం రైతులకి చేస్తున్న మంచి కనిపిస్తుంది. ఒక పక్క మోటార్ నుంచి నీళ్ళు గల గలా బయటకు వస్తున్నాయి, పచ్చని పైరులు కనిపిస్తున్నాయి, రైతులకి కరెంటు ఎలా వస్తుంది అన్న విషయం, కర్నూలు లాంటి చోట్ల నీటి కష్టాలు లేవు అనే విషయం ఆ ఫొటో చెబుతోంది. ఒక పక్క రైతులు పంటలు లేక, కరెంటు లేక, నీళ్ళు లేక విలవిలలాడుతున్నారు అని జగన్ చెబుతున్న మాట. కానీ పచ్చదనం  చూస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని తెలుస్తోంది. 
                          మొత్తంగా మంచి ఫొటో తీసి టీడీపీ ఖ్యాతిని జగన్ అండ్ టీమ్ మరింత పెంచింది. అదండీ అసలు సంగతి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



1 Comment

  1. ఐతే ఇందులో లేటెస్ట్ ట్విస్టు, ఏమిటంటే ఆ ఫోటో జగన్ ది కాదు, సాక్షి రిపోర్టర్ ది అని. వింత ఏమిటంటే, శ్రీమతి భారతి జగన్, తన భర్త ను, గుర్తు పట్టక పోవటం! మిగతావారు పొరబాటు పడ్డా, భార్య తన సొంత భర్తను గుర్తు పట్టకపోవడం విడ్డూరమే!

Leave a Reply

Your email address will not be published.


*