నంది అవార్డులపై విషం చిమ్ముతున్నారాWant create site? Find Free WordPress Themes and plugins.
           అన్న నందమూరి తారక రామారావు చరిత్రలో నిలిచే ఎన్నో చిత్రాల్లో నటించారు, నిర్మించారు, మెప్పించారు. తన సినిమాలు, రాజకీయాలతో తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన నటనలో కొద్ది శాతం ఇప్పటి వారికి లేదంటే అతిశయోక్తి లేదు. అలాంటి నటుడుకి వచ్చిన నంది అవార్డుల సంఖ్య ఒక్కటి. టీడీపీ పాలనలో ఉన్న సమయంలోను ఆయన నంది అవార్డుల కోసం వెంపర్లాడలేదు. రామాయణ, మహాభారతం, పౌరాణిక, సాంఘిక, సామాజిక చిత్రాల్లో ఆయన నటనా కౌశలం అద్భుతం. తనకు అధికారం ఉన్నా కనీసం మంచి చిత్రాలు వచ్చినా ఏనాడు బాలయ్య బాబుకు నంది అవార్డు ఇచ్చుకోలేదు. పక్షపాతం వద్దని విమర్శలు ఉండకూడదని ఆ పని చేశారు. మిగతా వారికే ఆ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు నంది అవార్డుల గురించి మాట్లాడే వారు ఆనాటి సంగతులు చూడాలనే సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
దాన్ని మీ కోసం… యదాతథంగా ఇస్తున్నాం..
       1949లో చిత్రసీమలో ప్రవేశించిన ఎన్.టి.ఆర్ 1963 వరకూ నటించిన వాటిలో అత్యుత్తమ నటనని ప్రదర్శించిన కొన్ని చిత్రాలు ఇవి… పాతాళ భైరవి, గుండమ్మ కథ , మల్లీశ్వరి, పిచ్చి పుల్లయ్య, కన్యాశుల్కం ,మిస్సమ్మ, మహామంత్రి తిమ్మరుసు, రక్త సంబంధం, చిరంజీవులు, లవకుశ, పాండురంగ మహత్యం, భూకైలాస్, రాజమకుటం, సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, భీష్మ, గులేబకావళి కథ, నర్తనశాల, వెంకటేశ్వర మహత్యం
        1964 లో నంది పురస్కార ప్రదానం మొదలు పెట్టాక విడుదలైన శ్రీ కృష్ణ పాండవీయం, పల్నాటి యుద్ధం, దానవీరశూరకర్ణ, ఎదురీత, గుడిగంటలు, శ్రీకృష్ణావతారం, రాము, వరకట్నం, చిట్టి చెల్లెలు, శ్రీ కృష్ణసత్య, బడిపంతులు, రామాంజనేయ యుద్దం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర, జస్టిస్ చౌదరి , మేజర్ చంద్రకాంత్ , శ్రీనాథ కవిసార్వభౌమ చిత్రాల్లో తారకరాముని నటన అజరామరం.
        రామునిగా, కృష్ణునిగా దాదాపు 22 చిత్రాల్లో నటించిన అన్న గారు సుమారు 40 దాకా రామాయణ మహాభారత పురాణ పాత్రలు పోషించి జన నీరాజనాలు అందుకున్నారు.
      మొత్తం గా జాతి గర్వించదగిన ఇంతటి మహానటుడి కి ఉత్తమ నటుడిగా వచ్చిన నంది పురస్కారాల సంఖ్య – 1
ఇతర నటులకి వచ్చిన పురస్కారాల సంఖ్య
=========================================
అక్కినేని నాగేశ్వరరావు – 5
శోభన్ బాబు – 5
వెంకటేష్ – 5
బాలయ్య -3
నాగార్జున -3
చిరంజీవి -3
జగపతి – 3
మహేష్ -3
కమల్ – 3
కృష్ణం రాజు -2
దాసరి -2
రాజేంద్ర ప్రసాద్ -2
ప్రభాకర్ రెడ్డి – 2
రాళ్ళపల్లి – 1
మురళీమోహన్ -1
గోకిన రామారావు -1
సుమన్ – 1
కృష్ణ – 1
యస్వీయార్ – 1
చంద్రమోహన్ -1
హేమ సుందర్ – 1
ఎన్.టి.ఆర్ జూనియర్ – 1
     కానీ ఆయన కానీ , ఆయన వర్గం కానీ, ఆయన అభిమానులు కానీ, ఆయన సామాజిక వర్గం కానీ ఎప్పుడూ నంది పురస్కారాల విషయంలో అసహనాన్ని, అసంతృప్తి ని ప్రదర్శించలేదు.
        బావ బావ మరిది, దూకుడు, ఇంద్ర, మన్మథుడు, సంతోషం, ఆడవారి మాటలకి అర్థాలే వేరు లాంటి సగటు చిత్రాల కథానాయకులకి నంది వచ్చినప్పుడూ ఎవరూ మాట్లాడలేదు.
…పంచెకట్టులో పల్లెపట్టు కథ ని అద్భుతంగా ఆవిష్కరించిన మంగమ్మ గారి మనవడు చిత్రానికి, 
…గ్రామీణ ప్రాంతపు చేనేత కుటుంబాల వ్యథని అద్భుతం గా చూపించిన జననీ జన్మభూమి చిత్రానికి, 
…బొగ్గు గని కార్మికుల సమస్యలని ప్రాణాలు పణంగా పెట్టి తీసిన నిప్పురవ్వ చిత్రానికి, 
…తెలుగు నాట కనుమరుగైన జానపదాలకి ప్రాణం పోసిన భైరవద్వీపం చిత్రానికి, 
…పౌరుష రౌద్ర రసపోషణ ని పతాక స్థాయి కి తీసుకెళ్లిన రౌడీ ఇన్ స్పెక్టర్, సమర సింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి చిత్రాలకి,
…చరిత్ర పుస్తకాల్లో మాత్రమే చదువుకున్న సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీ కృష్ణదేవరాయల పాత్ర లో జీవించిన ఆదిత్య 369 చిత్రానికి 
        ఉత్తమ నటుడి గా నంది పురస్కారం రానప్పుడు ఒక్క వ్యాఖ్య కూడా చేయని బాలయ్య మీద సామాజిక వర్గం పేరుతో విషం చిమ్మడం బురదజాతి నీచ సంస్కృతి కి నిదర్శనం.
         బాబు ఫన్నీ వాసు.. యేటా విడుదలయ్యే తెలుగు చిత్రాల సంఖ్య సగటున 60. అందులో నువ్వు చెప్పే మీ బద్దకిస్టు కథానాయకులు నటించేది మహా ఐతే 5, 6 ..నష్టాలు వస్తే సుమారు 45-50 కోట్లు మొత్తం .. లాభాలు వస్తే మీరు అమ్మే అత్యథిక రేట్లు పోగా వచ్చేది 20, 25 కోట్లు.. నువ్వేమో 50% ఆదాయం మా వాళ్లే తెస్తారు అంటున్నావు..తర్కానికి అందని ఈ వాదన ఏంటో నీకే తెలియాలి ..ఎన్.టి.యార్, కృష్ణలు 3 షిఫ్టుల్లో యేటా 10 సినిమాలు చేసి దాదాపు అన్నీ విజయాలు సాథించినా పురస్కారాలు రాలేదని బాధపడలేదు.
      మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి నటుల ఉత్తమ చిత్రాలున్నా మేస్త్రి లాంటి చెత్తచిత్రానికి దాసరికి ఉత్తమనటుడి గా నంది వచ్చినప్పుడు మీ గుంపు నిద్రపోతుందా .. కులరాజకీయ సమీకరణాల లెక్కల్లో అర్హత లేని చిరంజీవికి భూషణాలు (పద్మ భూషణ్) వచ్చినప్పుడు మేము దూషణలకి దిగలేదు.
        హిమనగమంత మహోన్నతుడు ఎన్.టి.ఆర్ ని వదిలేసి అక్కినేని, సునీల్ దత్తు ,దిలీప్ లకు దాదాసాహెబ్ ఫాల్కే వచ్చినప్పుడూ మాట్లాడలేదు.
        దాదాపు వరుస గా 15,20 సంవత్సరాలు ప్రతి యేడాదీ సాంఘిక,పౌరాణిక,జానపద, చారిత్రక చిత్రాల్లో నటించిన ఎన్.టి.ఆర్ ని పరిగణించకుండా వరుస పెట్టి అక్కినేని మూస ప్రేమకథలకి నందులిచ్చినా మేము మాట్లాడలేదు
       ఎందుకంటే పూజామందిరాల్లో పటాలు పెట్టి ప్రజలు పూజించుకున్న ఏకైక నటుడు మా ఎన్.టి.ఆర్.. ఆ స్థాయి ఎవరికీ ప్రజలు ఇవ్వలేదు,,ఇవ్వరు కూడా..
ఇక పోతే గుణ శేఖర్.
         ఈయన దర్శకత్వం వహించిన లాఠీ, మనోహరం, బాల రామాయణం, ఒక్కడు, అర్జున్, సొగసు చూడ తరమా చిత్రాలకి నంది పురస్కారాలు వచ్చాయి. వీటిలో కొన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రదానం చేసినవి. ఒక్క చిత్రానికి రాలేదని వ్యాఖ్యలు చేయడం ఆయన విచక్షణకే వదిలెయ్యాలి.
         ఐనా అడవి బాపిరాజు రాసిన వీరాథివీరుడు “గోన గన్నారెడ్డి” లక్షణాలు “రుద్రమదేవి” సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర లో ఇసుమంతన్నా ఉందా? ఊర్లో పొలాల్లో ఎలుకబుట్టలు పెట్టే వాడిలా చూపించి ముయ్యవయ్యా అంటూ మురికి మాటలు చెప్పించి ఆ చిత్ర ఉదాత్తత నే దెబ్బ తీసావు. పురస్కారాలు ఎందుకివ్వాలి మీకు ..
      ఇక మనం చిత్రం..అక్కినేని వంశం వారు నలుగురు నటించారు. ఎవరికివ్వాలి నంది.. ముందు కథానాయకుడు ఎవరు ఈ చిత్రంలో.. లెజెండ్ చిత్రంలో బాలకృష్ణ లా నవరసాలు పొషించే ఆస్కారమున్న పాత్ర ఎవరికీ లేదు ఈ చిత్రంలో .. ఐనా ద్వితీయ ఉత్తమ చిత్రం పురస్కారం వచ్చింది..ఇంకేం కావాలో
        ఇక బినామీ గణేష్, ఫన్నీ వాసు : గత 3 సంవత్సరాల్లో వీళ్లు చెప్పే కథానాయకులు చిత్రపరిశ్రమకి తెచ్చిపెట్టిన లాభాల కన్నా నష్టాలు ఎక్కువ.,,
       ఇక పోతే లెజెండ్ , జనతా గారేజ్ ,శ్రీమంతుడు చిత్రాలకి ఉత్తమ నటుడిగా బాలకృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్ , మహేష్ లకి వచ్చిన నందుల సంగతి..
         అవార్డులు రావాలంటే పాత్రకి తగ్గట్లు నటించాలి. లెజెండ్ లో బాలయ్య-జగపతి మథ్య సన్నివేశాలు రెండు కొదమ సింహాలు కలబడ్డట్టే ఉంటాయి తప్ప మరొకటి కాదు..జనతా గారేజ్ లో మోహన్ లాల్ స్థాయి నటుడిని సైతం ఒక్క హావభావం తోనే మింగేసిన ఎన్.టి.ఆర్ నటన అద్భుతం..ఇక శ్రీమంతుడు లో మహేష్ చాలా సహజంగా నటించాడు. ఇలాంటి సినిమాలు ఉంటే బ్రహ్మానందం కథానాయకుడిగా నటించిన రేసు గుర్రం లాంటి సగటు మసాలా చిత్రానికి ఎలా అవార్డు వస్తుందనుకున్నావు తెల్లమలుపు బుజ్జి బాబూ. కాస్త ఎదుగు.. 
       ఎప్పుడూ చిన్న సినిమాలకి థియేటర్లు దొరక్కుండా చేయటం, దొంగ లెక్కలు చెప్పడం కాదు. అప్పుడప్పుడు శిక్షణా తరగతులకి వెళ్లి కాస్త నటించడం నేర్చుకోమని మీ సో కాల్డ్ మహానటులకి చెప్పు..కాదు ఇలాగే ఆకాశం మీద ఉమ్మేస్తాం.. సూర్యుడి మీద రాళ్లేస్తాం.సముద్రాన్ని తోడేస్తాం అంటే మీ మూర్ఖత్వం ..మర్చిపోయారా.. అప్పుడెప్పుడో మనోడు హిందీ జంజీర్ చేస్తే అక్కడి మీడియా సింగిల్ ఎక్స్ ప్రెషన్ చెక్క మొహం అని రాశారు. మగధీరకు అల్లు అరవింద్ తప్పుడు లెక్కలు చూపించారని రాజమౌళి కామెంట్ చేస్తే ఇంత వరకు సమాధానం లేదు. మీరా మాట్లాడేది. 
       ఇది ఎవరో పంపిన ఐటమ్. దీనికి నమస్తే ఆంధ్రాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఆ లేఖ రాసిన పాఠకుని కోణంలోనిది మాత్రమే. ఇందులో నిజం, అబద్దం, మరేదైనా ఉండవచ్చు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.2 Comments

  1. entha prema ra miku TDP ante .. oka vella oodipothe emi chesataru raa jagan jai koduthara leka pavan antu kalla mida paduthara .. NTR gariki award rakapovadam nijam gane chala badha gane undi kani aypoina sangathulu epudu thovi evarini manchiga chupinchadaniki chestunaru Chandra babu garina leka balaya babu na … rastraniki kavalsindi awards kadhu Special Status kavali … asalu awards ki GOV ki sambandame ledu anthe kadhu NTR garini epudu lagadam ante siggu undali … jeevita garu awards announce chesaka press meet lo CM garini GOV ni antha ga pogadalsina avasaram enti .. Special Status leka povadam valla rastram intha la ibandi padutu unte dhani gurinchi matladaniki dhamu ledu kani CM garu dynamic ani gov daring and dashing pogadadam endhuku ..

  2. entha prema ra miku TDP ante ….. oka vella oodipothe emi chesataru raa jagan jai koduthara leka pavan antu kalla mida paduthara .. NTR gariki award rakapovadam nijam gane chala badha gane undi kani aypoina sangathulu epudu thovi evarini manchiga chupinchadaniki chestunaru Chandra babu garina leka balaya babu na … rastraniki kavalsindi awards kadhu Special Status kavali … asalu awards ki GOV ki sambandame ledu anthe kadhu NTR garini epudu lagadam ante siggu undali … jeevita garu awards announce chesaka press meet lo CM garini GOV ni antha ga pogadalsina avasaram enti .. Special Status leka povadam valla rastram intha la ibandi padutu unte dhani gurinchi matladaniki dhamu ledu kani CM garu dynamic ani gov daring and dashing pogadadam endhuku ..

Leave a Reply

Your email address will not be published.


*