బాలయ్య దేవుడు అంటున్న యాంకర్



Want create site? Find Free WordPress Themes and plugins.
ఉదయభాను. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ‘హార్లిక్స్ హృదయాంజలి’ పేరుతో ఈటీవీలో ప్రారంభమైన ప్రోగ్రామ్ తో ఉదయభాను బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది. కుర్రకారు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ తరువాత వన్స్ మోర్, సాహసం చేయరా ఢింభకా, రేలా రే రేలా, ఢీ వంటి  ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించింది. హోస్ట్ గా సినిమా ఫంక్షన్స్ లలో తన మాటలతో అలరించింది. ఆ తర్వాత ఉదయభాను పెళ్లి చేసుకోవడం, కవల పిల్లలు జన్నించడం జరిగాయి. 
                           ఉదయభాను తమ పిల్లల బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఆమె ‘నీతోనే’ అనే డాన్స్ షోలో కనిపిస్తోంది. ‘భాను ఈజ్ బ్యాక్’ అని స్టార్ మాటీవీ ఊదరగొట్టేసింది. దశాబ్దాల పాటు తెలుగు బుల్లితెరను ఏలిన రాణిగా ఉదయభాను ఇప్పుడు సరికొత్తగా కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న డాన్స్ రియాల్టీ షో లో ఉదయభాను పాల్గొంటోంది. ‘నీతోనే డాన్స్’ అనే డాన్స్ రియాల్టీ షోకు ఆమె జడ్జిగా వ్యవహరించింది. ఇందులో ఉదయభాను తన మనసులో మాట చెప్పింది. 
                        తనకు మొదట్లో పుట్టిన సంతానం లేకుండా పోయింది. అందుకే విజయ్ ను పెళ్లి చేసుకున్నాను. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తనకు కవల పిల్లలు పుట్టారు. వారి పుట్టిన రోజు ఘనంగా చేసేందుకు సిద్దమయ్యాను. చాలా మంది ప్రముఖులకు ఫోన్లు చేశాను. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బాలయ్య బాబుకు మిగతా వారితో పాటే ఫోన్ చేశాను. సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల లిప్ట్ చేయలేదు. ఆయనకు చిన్న మెసేజ్ పెట్టాను. ఇరవై నిమిషాల తర్వాత ఆయనే ఫోన్ చేశారు. భాను నేను వస్తాను. పిల్లలకు బ్లెస్సింగ్స్ ఇస్తానని చెప్పారు. ఆ రోజు అనంతపురం పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా.. తన కోసం బాలయ్య దాన్ని పోస్ట్ ఫోన్ చేశారు. 
                          మిగతా వారిలా ఇలా వచ్చి అలా వెళ్లకుండా చాలా సేపు తమతో గడిపి పిల్లలను ఆశీర్వదించారు. తల్లి బాధను అర్థం చేసుకున్నారు. నిజంగా నందమూరి బాలయ్య నడిచి వస్తుంటే సింహం కనపడింది. ఆయన సింప్లిసిటీ చాలా నచ్చింది. అందుకే జై బాలయ్య. జై జై బాలయ్య అంటూ స్టార్ మాటీవీ కార్యక్రమంలోనే చెప్పేసింది. మరోవైపు రేణు దేశాయ్ బాలయ్య నటనను మెచ్చుకున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*