నంది అవార్డుల రగడ పై ఓ అభిమాని రాసిన లేఖWant create site? Find Free WordPress Themes and plugins.
        నంది అవార్డుల పై ఓ టీవీ చానల్ లో అవసరానికి మించి కథనాలు ఇచ్చారు.. ఇదేదే పెద్ద తప్పు అన్నట్లుగా గంటలకు గంటలు ఆ వివాదానికి ఆజ్యం పోశారు. అందుకే ఇందుకు బదులుగా సోషల్ మీడియాలో ప్రత్యేక కథనం వచ్చింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఎవరు రాశారు. ఏంటనేది తెలియదు. అది యధాతథంగా మీ కోసం… 
1984 మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ హిట్, ఆ టైంలో అన్న గారు ముఖ్యమంత్రి – నంది అవార్డు రాలేదు.
1986 ఇంతవరకు ఎవరికి లేని రికార్డు ఒకే సంవత్సరంలో 6 సినిమాలు బాక్సాఫీస్  హిట్స్ ,
ఆ టైంలో అన్న గారు ముఖ్యమంత్రి  – నంది అవార్డు రాలేదు.
1991 ఆదిత్య 369 & 1994 భైరవదీపం ఏ హీరో ట్రై చేయని జోనర్స్ లో మూవీస్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అయినా – నంది అవార్డు రాలేదు.
2000 కలెక్షన్స్ విషయంలో ఇండస్ట్రీకి కొత్త అర్ధం చెప్పిన సినిమా సమరసింహారెడ్డి , సొంత బావ ముఖ్యమంత్రి – నంది అవార్డు రాలేదు.
ఆయన కుటుంబానికి అధికారం కొత్త కాదు. ఇప్పుడు కొత్తగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవార్డ్ తీసుకోవడానికి.!
1983 – 89 :  7 సంవత్సరాలు ఆయన తండ్రిగారు  ముఖ్యమంత్రి 
1994 – 2004 : 10 సంవత్సరాలు వారి కుటుంబంలోనే ముఖ్యమంత్రి పదవి (కొన్నాళ్ళు తండ్రిగారు, 9 సంవత్సరాలు బావగారు)
         అంటే మొత్తం 17 సంవత్సరాలు వారి కుటుంబంలోనే ముఖ్యమంత్రి పదవి వుంది. కానీ బాలయ్య గారికి నంది అవార్డ్ వచ్చింది ఒకే ఒక్కసారి “నరసింహనాయుడు” సినిమాకి. నిజంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తీసుకోవాలి అంటే కనీసం ఈ పదిహేడు ఏళ్ళలో నాలుగైదు సార్లు తీసుకునే అవకాశం ఆయనకు వుంది. కానీ అలా చేయలేదు. 
       బాలకృష్ణ గారికి ఎన్నో సార్లు అవార్డ్ రావలసి వున్నా రాకపోవడానికి రెండు కారణాలు వున్నాయ్. తెలుగుదేశం ప్రభుత్వంలోనేమో ఆయనకు ఇస్తే సొంత కొడుకు/బావమరిది కి ఇచ్చుకున్నారు అనే విమర్శలు వస్తాయని అద్భుతంగా నటించిన పాత్రలకి కూడా అవార్డ్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యర్ధి పార్టీ వ్యక్తికి ఇవ్వడం ఏంటి అనే  రాజకీయ కారణాల వల్ల ఇవ్వలేదు. కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవార్డ్ తీసుకున్నారు అనడానికి ఎవరికీ అర్హత లేదు.
       బాలకృష్ణ గారికి రెండో సారి ఉత్తమ నటుడి అవార్డ్ వచ్చింది 2011 లో  “సింహా ” సినిమాకి ,  కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో. దాంట్లో బాలకృష్ణ గారు influence చేసే అవకాశం లేదని అందరికీ తెలుసు. ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చింది 2014 లో విడుదలైన  “లెజెండ్” సినిమా లో నటనకు  ఉత్తమ నటుడి అవార్డ్. 
       విమర్శకులు అర్ధం చేసుకోవాల్సింది ఏంటీ అంటే తెలుగుదేశం అధికారంలో వున్న 20 ఏళ్ళలో బాలకృష్ణ గారికి అవార్డ్ వచ్చింది రెండు సార్లే. ఇంత చెప్పిన తరువాత కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతాం అంటే మీ ఇష్టం.
      ఆయన అవార్డులే కావాలనుకుంటే ఇప్పటికీ డజను పైగా నందులు ఆయన ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేవి…..అవార్డుల కోసం పైరవీలు చేసే తత్వం ఉన్నవాడు కాదు మా నటసింహం… విమర్శకులు ఇది అర్ధం చేసుకుంటే మంచిది.
    
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

Leave a Reply

Your email address will not be published.


*