కాంట్రాక్టులు చేస్తే తప్పేంటన్న జవహర్ 



Want create site? Find Free WordPress Themes and plugins.
        మంత్రి జవహర్ ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు. బీరు ఆరోగ్యానికి మంచిదని ఆ మధ్య చెప్పి అభాసు పాలయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా బెల్టుషాపులు ఉన్నట్లు సమాచారం అందిస్తే అరగంటలో మూసివేయిస్తామన్నారు. 1100కి కాల్‌ చేయాలని ప్రజలకు సూచించారు. అసలు ఏ గ్రామంలో బెల్ట్ షాపులు లేవో మంత్రి చెబితే బాగుంటుందనే సెటైర్లు వచ్చాయి. పర్యాటక శాఖకు సంబంధించిన ఒక టెండర్ సబ్ కాంట్రాక్టు తన కుమారుడుకి దక్కేలా చూశాడు మంత్రి జవహార్. 
     అదేదో సినిమాలో హీరో రవితేజ అన్నట్లు ఉంది జవహర్ డైలాగ్. కమిషనర్ కూతురు పెళ్లి చేసుకోదా..కమిషనర్ కూతురుకు మొగుళ్లు రారా అని హాస్యంగా చెబుతాడు. ఇప్పుడు జవహర్ అలాంటి సామెతే చెబుతున్నారు. మంత్రి కొడుకులు వ్యాపారులు చేసుకోకూడదా..వారి బాగు పడకూడదా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు..తన కొడుకుకు కాంట్రాక్టు ఇప్పించి మరీ పనులు చేయిస్తున్నారు. 
       పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని పాత రైలువంతెన నుంచి రోడ్డు కం రైలు బ్రిడ్జి వరకు గోదావరి నదీతీరంలో 9.90 ఎకరాల భూమి ఉంది. జలవనరుల శాఖకి చెందిన ఈ భూమిని ఇటీవలే పర్యాటక శాఖకి బదలాయించారు. ఈ భూముల్లో కాటేజ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్, పుడ్‌ కోర్టులతో పాటు కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.7.75 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పనులకు గత నెలలోనే టెండర్లు ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్‌కి చెందిన ఎన్‌జేఆర్‌ (ఎన్‌.జనార్ధన్‌రావు) కనస్ట్రక్షన్స్‌ పనులు దక్కించుకుంది. కానీ ఆ పనులను బినామీ కాంట్రాక్టర్ల పేర్లతో మంత్రి జవహర్ కుటుంబం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. 
        ఇందుకు బలం చేకూరుస్తున్నట్లు ఉంది జహవర్ మాట తీరు. రాష్ట్ర మంత్రి కుమారుడికి వాటా ఉందన్న ప్రచారాన్ని తన మాటల ద్వారా మంత్రి నిజం చేస్తున్నారు. అసలు తన కుమారుడు సబ్‌కాంట్రాక్ట్‌ తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు. కాటేజ్‌లు, రెస్టారెంట్, కల్చరల్‌ సొసైటీ వంటి నిర్మాణాలు ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన తర్వాత వీటి నిర్వహణను 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకునే ఆలోచన చేస్తున్నారట మంత్రి. ఈ భూముల్లో ప్రస్తుతం 24 కాటేజీలు, ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్, పుడ్‌కోర్టు నిర్మాణం చేస్తున్నారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ కాంట్రాక్టులు తీసుకోవడం తప్పే అవుతుందని జవహర్ కు తెలియదనుకుంటా. అందుకే ఇలా తన కొడుకును సమర్థించుకుంటున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*