రోజా హోం మినిస్టర్ అటWant create site? Find Free WordPress Themes and plugins.
         ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఇదేనేమో. ఇప్పుడు నగరి ఎమ్మెల్యే రోజా తీరు, మాటలు అలానే ఉన్నాయంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రోజాకు హోం మంత్రి పదవి కావాలట. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతల సమస్య లేకుండా చేస్తానని చెబుతున్నారు. అసలు ఎన్నికలు జరగలేదు. ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. కానీ కలలు కంటున్నారు. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఇప్పడు రోజా కలల్లో హోం మంత్రి అయినట్లు ఫీలవుతున్నారట. కానీ అదే విషయాన్ని తమ పార్టీ నేతలకు చెప్పేశారట. 
       బొత్సకు ఎక్సైజ్, చెవిరెడ్డికి అడవులు, అంబటికి స్త్రీ శిశు సంక్షేమం శాఖలు ఇస్తారనే చర్చ అప్పుడే జరుగుతోంది. ఇవన్నీ వారిని చూసి ఇస్తున్నారా లేక సెటైర్ గా అంటున్నారా అనేది తెలియడం లేదు. 2014లోను ఇలానే కలలుగన్నారు. కానీ నిజం కాలేదు. ఈ సారి అదే పంథాలో వెళుతున్నారట. జగన్ మహాసంకల్ప యాత్రకు జనాలు పెద్దగా రావడం లేదు. అధికార పార్టీ మీద పెద్దగా వ్యతిరేకత లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. గతంలో చంద్రబాబు, వైఎస్ లు పాదయాత్ర చేసిన సమయంలో జనం పెద్ద ఎత్తున వారితో ఉన్నారు. కానీ ఈ సారి అలా ఉండటం లేదు. జగన్ ను జనం దూరం పెట్టారా.. లేక జగనే జనాలతో సంబంధం లేకుండా దూరంగా వెళుతున్నారా అనే చర్చ సాగుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

  1. roja ku home isthe chandrababu jailuke,chevireddyki adavulisthe seshachalamlo yerrachandanam free, ika ambatiki sthree samkshemam isthe ika dummu lepesthadu.

Leave a Reply

Your email address will not be published.


*