తిరిగి ప్రారంభమైన జగన్ పాదయాత్ర



Want create site? Find Free WordPress Themes and plugins.
        కోర్టు కేసుకు హాజరై ఒక రోజు విశ్రాంతి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరిగి తన పాదయాత్రను ప్రారంభించాడు. ఆక్రమాస్తుల కేసులో భాగంగా ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు జగన్ హాజరవుతున్నసంగతి తెలిసిందే. నిన్న కోర్టుకు హాజరైన జగన్ తన యాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కు వెళ్లారు. తిరిగి ఇవాళ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం దొర్నిపాడు నుంచి ప్రారంభించారు. అల్పాహారం తీసుకున్న తర్వాత ఉదయం 8 గంటలకు జగన్ తన పాదయాత్ర ప్రారంభమైంది. కొలవకుంట్ల మండలం కంపమల్ల మెట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉయ్యాలవాడ క్రాస్ రోడ్ మీదుగా భీమునిపాడు వైపు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జగన్ పెరా బిల్డింగ్స్, కోవెలకుంట్ల, కోవెలకుంట్ల బస్టాండ్ సెంటర్ మీదుగా సాయంత్రం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. కర్రా సుబ్బారెడ్డి విగ్రహం వద్దకు చేరుకోగానే నేటి పాదయాత్ర ముగియనుంది. ఈ రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు.  
      11వ రోజు పెద్దగా జనాలు లేకుండానే యాత్ర కొనసాగడం పట్ల వైకాపా శ్రేణులు నిరాశలలో కూరుకుపోయాయి. మరోవైపు కోవెలకుంట్లలో భారీగా జనాలు ఉండేలా ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*