బీజేపీకి జగన్ బంపర్ ఆఫర్



Want create site? Find Free WordPress Themes and plugins.
       ఏపీలో రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దాం. మీకు నేను పది ఎంపీ సీట్లు, 35 అసెంబ్లీ స్థానాలు ఇస్తానని చెప్పారట విపక్ష నేత జగన్. ఇందుకు బీజేపీ హైకమాండ్ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారట. తెలుగుదేశం పార్టీని కాదని ముందుకు వెళితే నిండా మునుగుతామని ఆలోచిస్తున్నారట. లేకపోతే ఈ పాటికి బీజేపీ, వైకాపా బంధం బయట పడేదంటున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ముందు నుంచీ ఇదే బంధాన్ని పటిష్టం చేసేందుకు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. అదే సమయంలో విజయసాయిరెడ్డి హస్తిన స్థాయిలో మిగతా వారితో మాట్లాడి కమలం పార్టీ తమతో కలిసి ఉండేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నారట. 
       అందుకే ఎక్కువ సమయం ఆయన ఢిల్లీలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ మీకు కేవలం నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చింది. మేము 10 ఇస్తామని చెబుతున్నాం. టీడీపీ అంత కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారట. బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకే తిరుమల పర్యటనలు, స్వామీజీలను కలవడం వంటివి వచ్చాయట. అంతే కాదు..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని కార్నర్ చేయకుండా ఆగడానికి ఇదే కారణమట. ఇంకోవైపు ఎంపీలతో రాజీనామా చేసి బీజేపీని ఇరుకున పెట్టే ఆలోచన చేసినా..ఆ తర్వాత వెనక్కు తగ్గారట. కేవలం ఆ పార్టీతో బంధం కలుపుకునేందుకే ఈ పనిచేస్తున్నట్లు సమాచారం వస్తోంది. 
        సంఘ పరివార్ ను ప్రసన్నం చేసుకునేందుకు కాషాయ దళం నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు జగన్ స్వామీజీలు, యజ్ఞాలు, యాగాదులు చేయిస్తున్నారట. లోక కల్యాణం కోసమే ఈ యాగాలు చేస్తున్నామని చెబుతున్నా…అధికారం కోసమే ఇవన్నీ చేస్తున్నారని తెలుస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*