దిక్కు తోచని స్థితిలో జగన్



Want create site? Find Free WordPress Themes and plugins.
 
       ఏదో పాదయాత్రకు కాస్తంత విశ్రాంతి నిచ్చి సేదదీరదామనుకున్నాడు విపక్ష నేత జగన్. కానీ ఆ కాస్త స్థిమితం లేకుండా సిబిఐ కోర్టు చీవాట్లు పెట్టింది. అక్రమాస్తుల కేసులో హాజరు అయినా జగన్ లాయర్ల పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది సిబిఐ కోర్టు. 30 ఏళ్ళ తమ సర్వీసులో ఎప్పుడూ ఇలాంటి వాదనలు వినలేదని న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. మొత్తం 11 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్, ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డితో పాటు.. జగన్ తరపు లాయర్లు ఈ మాటలతో ఖంగు తిన్నారు. పదే పదే విచారణ వాయిదా కోరడం సరికాదని చెప్పారు. రెండేళ్లుగా విచారణను జాప్యం చేస్తున్నారని ఇంకా ఎంత కాలం ఇలా ఆగమంటారని ప్రశ్నించారు న్యాయమూర్తి. కోర్టు సమయాన్ని వృథా చేయడం కరెక్టు కాదని చెప్పారు. నాలుగు చార్జ్‌షీట్లను కలిపి వాదనలు వినాలన్న అభ్యర్థనను కోర్టు కాదనేసింది. చార్జ్‌షీట్‌ 9లో వాదనలు కొనసాగించాలని సీబీఐకి కోర్టు ఆదేశాలిచ్చింది. 
        జగన్ కేసులో 10వ చార్జీషీట్‌పై వాదనలు జరిగాయి. రాంకీ సిమెంట్‌లో తమకు ప్రత్యక్షంగా పెట్టుబడులు లేవని జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటీషన్ వేశారు. ఈ వాదనలు విన్న సీబీఐ కోర్టు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నెల 24న కోర్టుకు జగన్ హాజరుకావాలని న్యాయస్థానం చెప్పింది. న్యాయమూర్తి మాటలతో జగన్ ముభావంగా ఉన్నారట. అయినా సరే బయటకు తెలియకుండా పాదయాత్రలో యధాతధంగా పాల్గొంటున్నారంటున్నారు. ఈ కేసులు ఒక కొలిక్కి వస్తే తనకు స్వేచ్ఛ లభిస్తుందని భావిస్తున్నా రోజురోజుకు అవి మరింతగా బిగుసుకు పోవడం జగన్ లో అసహనాన్ని రేపుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*