లైంగిక వేధింపుల కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్సీ



Want create site? Find Free WordPress Themes and plugins.
వైకాపా నేత, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరు 5వ అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హజరుపర్చారు. తన ఆరోగ్యం బాగోలేదు అని చెప్పటంతో ఆయన్ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు గుంటూరు జిల్లా పోలీసులు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి మరీ అదుపులోకి తీసుకోవడం హాట్ టాపికైంది. 
                             ఓ దళిత యువతికి అంగన్‌ వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.50వేలు తీసుకున్నాడనేది ఆయన పై వచ్చిన ఆరోపణ. అంతే కాదు.. లైంగికంగా వేధించిన కేసులో టీజీవీ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణారెడ్డి అరెస్ట్‌ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేశ్‌ రెడ్డి, ఎల్‌.అప్పిరెడ్డిలు కోర్టు వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
                           కృష్ణారెడ్డిని మాచవరానికి చెందిన మాతా శోభ అనే మహిళ అంగన్‌వాడీ ఉద్యోగం కోసం ఆశ్రయించారు. ఇందుకుగాను కృష్ణారెడ్డి రూ.50 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఆమె ఎమ్మెల్సీ కార్యాలయం, ఇల్లు, అతిథి గృహానికి పలుమార్లు వెళ్లింది. ఉద్యోగం ఇప్పించకపోగా ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశాడనేది ఆరోపణ. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఈ నెల 10న నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి సెక్షన్‌తోపాటు లైంగిక వేధింపులకు సంబంధించి సెక్షన్‌ 354 ప్రకారం కేసు నమోదు చేశారు.
                          తమ నేత పై కావాలని కేసులు పెట్టించి వేధిస్తున్నారని మరోవైపు వైకాపా నేతలు ఆరోపించారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*