కాంగ్రెస్ నేతలనే తిట్టిన వీహెచ్



Want create site? Find Free WordPress Themes and plugins.
వీ హనుమంతరావు. కాంగ్రెస్ మాజీ ఎంపీ. ఇప్పుడాయన చూపు టీఆర్ఎస్ కంటే సొంత నేతల పైనే పడింది. వారిని తిట్టి పోశారాయన. ఆ… వయసు పైబడింది కదా.. లైట్ తీసుకుంటున్నారు మరోవైపు హస్తం నేతలు. అసలు ఏం జరిగిందంటే… భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజు వేడుకలు చేయలేదు టీఆర్ఎస్ సర్కారు. కనీసం అసెంబ్లీలోను నెహ్రు గురించి ప్రస్తావించలేదు. చిల్డ్రన్స్ డే నాడు పిల్లలకు ఇచ్చే బ్యాడ్జ్ పై గతంలో నెహ్రు బొమ్మ ముద్రించేవాళ్లు. ఇప్పుడు ఆ ఊసు లేదు. ఆందుకే వీహెచ్ కు కోపం వచ్చింది. 
                        అందుకే సొంత పార్టీ నేతల పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కి వచ్చిన వీహెచ్ నెహ్రు ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవమానపరుస్తున్నాయని మండి పడ్డారు. ఈ విషయం పై అసెంబ్లీ లో కాంగ్రెస్ నేతలు కనీసం నిరసన తెలుపకపోవడం దారుణమన్నారు. నేను ఉంటే ఇరగదీసేవాడనని అన్నారు. విషయం వెంటనే సిఎల్పీ నేత జానారెడ్డికి తెలిసింది. అంతే సభలో నెహ్రు అంశాన్ని ప్రస్తావించడంతో గందరగోళం నెలకొంది. 
                         దేశ మొదటి ప్రధానిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవమానపరుస్తున్నాయని వీహెచ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మధుమేహం పై ప్రత్రికలో ప్రకటన ఇచ్చింది. కానీ చిల్డ్రన్స్ డే సందర్భంగా దేశ మొదటి ప్రధాని నెహ్రు గుర్తు రాలేదా అని విమర్శిచారు. అసెంబ్లీలో మా పార్టీ ఎమ్మెల్యేలు కనీసం నిరసన తెలపకపోవడం ఏంటని ఆయన మీడియా ముందు చిందులు తొక్కారు. అసలు మనదేం ప్రతిపక్షం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వీహెచ్ అంతృప్తి వ్యక్తం చేశారు. నేనే అసెంబ్లీ లో ఉంటే.. అంటూ ఆయన మాటల దాడి చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దీనికి సమాధానం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాలల దినోత్సవాని ఘనంగా నిర్వహించిందని జానాకి చెప్పారు. 
                        కాంగ్రెస్ సభ్యులు నిరసనకు పట్టుపట్టారు. సభలో నిరుద్యోగుల అంశం పై చర్చ ఉంది. కాంగ్రెస్ ప్రస్తావించే అంశం ఎజండాలో లేదు. కనీసం వాయిదా తీర్మానం ఇవ్వలేదు. ఇలా ఎజెండాలో లేని అంశానికి ఎలా నిరసన తెలుపుతారని అడిగారు. వీహెచ్ వచ్చి గుర్తు చేసేవరకు కాంగ్రెస్ సభ్యులకు ఈ అంశం గుర్తుకు రాలేదా అని అసెంబ్లీ లో అధికార పార్టీ నేతలు చర్చించుకోవడం కనిపించింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*