టీడీపీ కామెంట్.. బీజేపీ ఓవరాక్షన్!



Want create site? Find Free WordPress Themes and plugins.

అసెంబ్లీలో మనకు ప్రతిపక్షంగా మనమే వ్యవహరించాలి అనే చంద్రబాబు పిలుపును తెలుగుదేశం నాయకులు ఎంత మేరకు అర్ధం చేసుకున్నారో గానీ.. భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా చక్కగా అర్ధం చేసుకునట్టు కనిపిస్తోంది. ఈసారీ 2014 ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి ప్రభుత్వంలో ఒకవైపు భాగస్వామ్య పార్టీగా ఉంటూనే.. వచ్చే ఎన్నికల నాటికి రాష్రంలో ఉండే రాజకీయ శూన్యతను వాడుకొని.. తామే ప్రధాన ప్రతిపక్షస్థాయికి ఎదుగుతాం అధికారపక్షంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ.. ప్రజల్లో సంక్షేమం కోసం పనిచేస్తాం అని భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో చెబుతూ వస్తుంది. అయితే వాస్తవానికి శాసనసభలో అంతగా గళం లేని భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్షంగా వ్యవహరించే అవకాశం ఎన్నడూ రాలేదు. ఒక వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ మీద ఎడా పెడా విమర్శల దాడితో ప్రతి సారీ అవి అసెంబ్లీలో విరుచుకుపడుతున్న నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా కిమ్మనకుండా అధికారపక్షంలో భాగస్వామ్యంగా ఉండిపోయారే తప్ప వారు కూడా ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసిన సందర్భాలు గతంలో లేవు. అయితే ఈసారీ ప్రధాన ప్రతిపక్షం అనేది సభలోనే లేకుండా పోగా.. తెలుగుదేశం పార్టీ సభ్యులే ఎవరికి వారు తమకు తోచిన చిన్న చిన్న సమస్యలను సభలో ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతున్నట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్న నేపధ్యంలో భరతీయ జనతా పార్టీ కూడా చాలా చురుగ్గా ప్రతిపక్ష పాత్రను పోషిస్తూంది,

ఎంతగా అంటే.. తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావిస్తున్న ప్రతి అంశంలోనూ కూడా భరతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్ అయిన విష్ణుకుమార్ రాజు ప్రతిసారీ జోక్యం చేసుకుంటూ.. తాను కూడా ఏదోఒక కామెంట్లు చేస్తూ.. చర్చకు అడ్డుపడుతున్నట్లుగా వ్యవహరించడం సభలో జరుగుతూవచ్చింది. అయితే విష్ణుకుమార్ రాజు వ్యవహరిస్తున్న శైలిపై తెలుగుదేశం నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం. చాన్స్ దొరికింది కదాని బీజేపీ చాలా ఓవరాక్షన్ చేస్తుందంటూ తెలుగుదేశం నాయకులు తమలో తాము మాట్లాడుకోవడం లాబీల్లో కనిపించింది. తాము లేవనెత్తుతున్న ప్రశ్నలతో పాటూ వాటికి అనుబంధంగా బీజేపీ నాయకుడు జోక్యం చేసుకుటున్న తీరు ఒక్కొకసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుందని.. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ మంత్రికి సంధిస్తున్న ప్రశ్నల విషయంలో మాత్రం ఆయనకు మద్దతుగా నిలవడానికి బీజేపీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమలో తాము మాట్లాడుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి తెలుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తులు ఎలా వుంటాయో.. తిరిగి ఇద్దరూ కలిసి అధికారపక్షంగా గద్ద ఎక్కుతారో లేదో కానీ.. ప్రతిపక్షం పాత్ర అంటే ఎలా వుంటుందో తాము చికాకు పెట్టదల్చుకుంటే ఎలాంటి వ్యవహారసరళతో స్పందిస్తూ ఉంటామో ఇప్పట్నుంచే ట్రయల్ పార్ట్ గా బీజేపీ వారికి రుచి చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాముగా పూర్తి స్థాయి ప్రతిపక్ష పార్టీ అయితే గనుక ఎంతగా నిలదీయగలమో దీన్ని బట్టి అర్ధం చేసుకువచ్చునని.. ఇవి ప్రజల ముందుకు వెళ్లి తమ ఇమేజ్ పుటప్ చేసుకోవడానికి కూడా వారు వాడుకుంటారెమో.. అలాంటి ఉద్దేశంతో ఉన్నారేమో అని కూడా పలువురు భావిస్తున్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*