రాజీనామా పై మాట్లాడిన రేవంత్ రెడ్డి



Want create site? Find Free WordPress Themes and plugins.
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రాజీనామా గురించి అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును కలిసి సి.ఎం ఆఫీసులోనే తన రాజీనామా పత్రం ఇచ్చి వచ్చానన్నారు. సి.ఎం చంద్రబాబు తన లేఖను ఎందుకు స్పీకర్ కు పంపలేదో తెలియదన్నారు. తాను రాజీనామా చేసినా చంద్రబాబు ఆపారని చెబుతున్న తీరు ఇప్పుడు హాట్ టాపికైంది. కావాలని ఆయన లేఖను ఆపే అవకాశం చంద్రబాబుకు లేదు. లేకపోతే పైకి రాజీనామా లేఖ ఇచ్చి.. తెర వెనుక మరో మాట చెబుతున్నారని అర్థమవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ అసలు.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదని చెప్పారు. ఇందుకు రేవంత్ రెడ్డి నుంచి సమాధానం లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆఫీసులోనే లేఖ ఇచ్చాను. ఆయనే పంపడం లేదని చెప్పడం కాస్తంత విడ్డూరంగానే ఉంది.  
                   అంతే కాదు.. తన వద్ద అనేక ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయని చెప్పడం చర్చకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ కు సంబంధించిన చాలా విషయాలు వెల్లడిస్తానని తెలిపారాయన. తన రాజీనామా గురించి టీఆర్ఎస్ నేతలను అడగమనండి. వారే చెబుతారు. అప్పుడే తాను అసలు సంగతులు చెబుతానని ప్రస్తావించారు. కేసిఆర్ తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పరోక్షంగా సీఎం కేసీఆర్ కు చెందిన కీలక రహస్యాలు ఏవో తన వద్ద ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాడు రేవంత్ రెడ్డి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*