అలాగైతే నాయకులకు బుద్ధొస్తుందా?



Want create site? Find Free WordPress Themes and plugins.

ఎన్నికలు జరిగినప్పుడు ఎవరికి ఎక్కువ వోట్లు వస్తే వాళ్ళు గెలిచినట్లు లెక్క. ఈ దామాషా, ఈ లెక్కల ప్రకారం మాత్రమే ఎన్నికల్లో విజేతలు నిర్ణయిస్తూ ఉంటారు. గెలిచిన వాళ్ళు ఎం.ఎల్.ఏ గానీ, ఎం.పీ గానీ అయ్యి అసెంబ్లీల్లో గానీ, పార్లమెంట్లలోగానీ కూర్చుని, ఈ దేశం ఎలా పని చేయాలో, ఈ దేశంలో ప్రజల అభివృద్ధి కోసం ఎలాంటి పనులు ప్రభుత్వాలు చేయాలో, చట్టాలను తయారు చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకు, ఒక నియోజకవర్గంలో లక్ష మంది జనం ఉంటే, వాళ్ళలో గరిష్టంగా ఎవరికీ రానంతగా, ముప్ఫై వేల మందీ ఒక వ్యక్తికి ఓట్లు వేసినా కూడా అతను ఎం.ఎల్.ఏ అయ్యే అవకాశం ఉంటుంది. మిగిలిన డెబ్భై వేల ఓట్లలో ముప్ఫై వేలకు మించి ఎవరికీ వచ్చి ఉండకూడదు. అలాటప్పుడు ముప్ఫై వేలు అనేది చిన్న సంఖ్య అయినా, పాసు మార్కులు కాకపొయినా సరే, అతను ఎం.ఎల్.ఏ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన ప్రజాస్వామ్యం ఇదే పద్ధతి మీద నడుస్తుంది.

తాజాగా, మన ఎన్నికల సంఘం నోటా విధానాన్ని కూడా ఓటు ప్రక్రియలో భాగంగా తీసుకువచ్చింది. నోటా అంటే ఏ అభ్యర్ధి తనకు నచ్చలేదు అని, వోటరు తన నిర్ణయాన్ని చెప్పే సదుపాయం. ఇప్పుడు, తాజాగా, ఈ నోటా అనే వెసులుబాటుకు, పూర్తి హక్కును ఇచ్చే ఒక ప్రయత్నంగా, సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఎన్నికల్లో అభ్యర్ధులకు వచ్చిన వోట్లకంటే, నోటాకు గనుక ఎక్కువ వోట్లు వచ్చినట్లయితే, అంటే ఎన్నికల్లో వోట్లు పోలైనప్పుడు నోటాకే ఫస్ట్ రాంకు వోట్లు వచ్చినట్లయితే గనుక ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలి అనేది ఈ పిటిషన్లు చేస్తున్న డిమాండ్. అంటే ఏ ఆ నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు ఆ అభ్యరర్ధులెవ్వరినీ ఇష్టపడడంలేదు అనే అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం పరిగణంలోకి తీసుకుని ఆయా పార్టీలను అభ్యర్ధులను మార్చాల్సిందిగా సూచించి, మళ్ళీ ఎన్నికలను నిర్వహిచాలి అనేది ఆ పిటిషన్ ద్వారా కోరుతున్నారు.

నోటాకు ఇలాంటి విస్తృతాధికారం కల్పించే పిటిషన్ పై తీర్పు అనుకూలంగా వస్తే గనుక రాజకీయ పార్టీలు బుద్ధులన్నీ మారే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక నియోజకవర్గంలో ఒక పెద్ద పార్టీ ఒక రౌడీకి, అవినీతిపరుడికీ టికెట్టించ్చిదంటే గనుక, ఆ రౌడీని సమర్థంగా ఎదుర్కోవడం కోసం మరొక పెద్ద పార్టీ కూడా అంతకు మించిన, అతనికి సరిపోగలిగిన రౌడీని మాత్రమే బరిలోకి తీసుకువచ్చి నిలబెట్టడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో, ప్రజలకు ఎంత కడుపుమంట ఉన్నా సరే, ఏదో ఒక రౌడీని ఎన్నుకోవాల్సింది తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఇన్నాళ్ళూ ఉండేది. ఇప్పుడు నోటాకు మెజారిటీ ఓట్లు వస్తే పూర్తిగా అభ్యర్ధులనే మార్చేసి, వాళ్ళని కొన్నాళ్ళ పాటు అనర్హులుగా ప్రకటించేసే చట్టం గనుక, కోర్టు తీర్పు ద్వారా సాకారం అయ్యిందంటే, ప్రజలందరూ ఈ ఇతర రౌడీలూ వద్దనుకోని నోటాకు వోట్లు వేసి వాళ్ళను అనర్హులుగా చేసి కొత్త అభ్యర్ధులు రంగంలోకి వచ్చేలాగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ పిటిషన్ అభ్యర్ధులను తిరస్కరించే విషయంలో కొత్త మార్పులను తీసుకువస్తుందని ఆశించవచ్చు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*