జగన్ ప్రసంగాల్లో కొత్త దనం



Want create site? Find Free WordPress Themes and plugins.
మహాసంకల్ప యాత్ర చేస్తున్న విపక్ష పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి కొత్తదనంతో ప్రసంగించారు. టీడీపీ, సి.ఎం చంద్రబాబు పై విమర్శ చేయకుండా ప్రసంగం చేయని జగన్ తొలిసారిగా పద్దతిగా మాట్లాడారంటున్నారు. గ్రామాల్లో ఎదురయ్యే చిన్న,చిన్న సమస్యలన్నిటికి అక్కడే 72 గంటల్లో పరిష్కారం అయ్యేలా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిస్తే ప్రజలకు ఎలాంటి కులం, మతం, ప్రాంతం, పార్టీల భేదాల తేడా లేకుండా సమస్యలు తీర్చే విధంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
                         ఇక మీదట పెన్షన్ కోసం ఎమ్మెల్యే చుట్టూనో, మరో నేత వద్దకో, లేక జన్మభూమి కమిటీలకో డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదని ప్రస్తావించారు. గ్రామ సచివాలయమే అన్ని పనులు చేస్తుందని ప్రస్తావించారు. అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులకు ఇందులో అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం ఆసక్తికరమే. అంతే కాదు.. అందులోను మిగతా సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ వంటివి ఏవి కావాలన్న గ్రామంలోనే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
                        వంద కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేసిన సందర్భంగా జగన్ కు కర్నూలు జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా ఒక దివ్యాంగుడు వచ్చి తనకు పెన్షన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. రాజకీయాలకు అతీతంగా పెన్షన్లు ఇవ్వాలని, దేవుడు చంద్రబాబుకు ఆ రకంగా బుద్ది ప్రసాదించాలని కోరుకుంటున్నానని జగన్ అన్నాడు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*