కోదండరామ్, కోమటిరెడ్డిల పార్టీ



Want create site? Find Free WordPress Themes and plugins.
కొండకు వెంట్రుక వేసి లాగితే, వస్తే కొండ.. పోతే వెంట్రుక అనే సామెతలో ఉన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. పీసీసీ అధ్యక్ష పీఠం కోసం హస్తిన స్థాయిలో గట్టిగానే పావులు కదుపుతున్నారు వాళ్లు. కానీ వారికి కాలంతో పాటు.. అదృష్టం కలిసి వస్తే సరే.. లేకపోతే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్న స్థితిలో తెలంగాణలో మరో పార్టీకి మారడం కంటే కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు వాళ్లు. కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి నేతలు వారికి వ్యతిరేకంగా ఉన్నారు. కనీసం కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి తోను వారికి సయోధ్య లేదు. ఫలితంగా కాంగ్రెస్ లో వారికి ఇబ్బందిని తెస్తోంది. విజయశాంతి, అజహరుద్దీన్ లు రానుండటంతో కోమటిరెడ్డిల హవా తగ్గనుంది. అది జరగడం వారికి ఇష్టం లేదు. అదే సమయంలో ఇప్పటికిప్పుడు ఉత్తమ్ ను తప్పించే ఆలోచన చేయడం లేదట హైకమాండ్. 
                   అందుకే ఇక కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారట. వారితో పాటు.. పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ను కలుపుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారట. కేసీఆర్ కు వ్యతిరేకంగా గట్టిగా పోరాడే వారిలో కాంగ్రెస్ ముందుంది. గతం కంటే ఆ పార్టీ మెరుగైంది. మంచి ఉత్సాహంలో ఉంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, మిగతా పార్టీలు పోటీ పడటం వల్ల అధికార పార్టీకే లాభం. అలా జరగకుండా ఉండాలంటే.. కేసీఆర్ కు వ్యతిరేకంగా వారు పొత్తు పెట్టుకోవాలనే ప్రచారం జరుగుతోంది. మరి ఏం చేస్తారో. ఇంకోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాదని.. డీకే అరుణకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన చేస్తుందట అధిష్టానం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*