జగన్ కు పోయే కాలం వచ్చిందన్న జేసీ



Want create site? Find Free WordPress Themes and plugins.
సంచలనాలకు కేంద్ర బిందువు జేసీ దివాకర్ రెడ్డి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో. ఏం చేస్తాడో పార్టీ నేతలకే కాదు.. ఆయనకు తెలియదు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రోజుకో విధంగా మాట్లాడతారు. ఒకరోజు ప్రజల సమస్యలు తీర్చలేక పోతున్నానని రాజీనామా చేస్తానని చెబుతాడు. మరో రోజు చంద్రబాబు సరిగా ఎంపీల్ని పట్టించుకోరని విమర్శిస్తారు. ఇంకొరోజు తన నియోజక అభివృద్ధి కోసం తమ ఎమ్మెల్యేలు సహకరించడం లేదని విరుచుకుపడతాడు. మొత్తంగా జేసీ వింతగా ప్రవర్తిస్తున్న రాజకీయ మేధావి.
                               తాజాగా ప్రతిపక్ష నేత జగన్‌పై నిప్పులు చెరిగాడు జేసీ.  జగన్ అరిగిపోయిన రికార్డు వదలాలని సూచించారు. మహానేత పేరు మాని, నువ్వేం చేస్తావో చెప్పాలని జగన్‌కు సూచించారు. నువ్వు ఎప్పటికీ ముఖ్యమంత్రివి కాలేవని, ప్రయత్నాలన్నీ మానుకోవాలని హితవు పలికారు. ప్రతి ఒక్కరికీ సొంత గడ్డపై ప్రేమ ఉండాలని, శ్రీశైలంలో నీరున్నా, లేకున్నా ఎవరెవరి కాళ్లు పట్టుకున్నాడో తెలియదు.. అనుమతులు ఉన్నా, లేకున్నా.. సీఎం చంద్రబాబు పట్టిసీమ ద్వారా అనంతపురం జిల్లాకు నీరందిస్తున్నారని చెప్పారు. జగన్ మాత్రం పుట్టిన జన్మభూమిని మర్చిపోయి.. రాయలసీమకు ఎలా ఇస్తారు.. పల్నాడుకు నీరివ్వాలని అనడం సరికాదన్నారు. మావాడికి  పోయే కాలం దాపురించిందని జగన్ ను ఉద్దేశించి జేసీ సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరమే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*