అరకు అందాలకు హాట్ ఎయిర్ బెలూన్ల తోడు



Want create site? Find Free WordPress Themes and plugins.
అరకు. అందమైన పకృతి సోయగం. అసలు అక్కడ అడుగుపెడితేనే మరో ప్రపంచం చూసినట్లు ఉంటోంది. జన జీవనానికి దూరంగా ఉండే ఆ ప్రాంతాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకలు విచ్చేస్తుంటారు. నడి వేసవిలోను చల్లగా హాయినిస్తోంది. అరకు పేరు వింటేనే మనసు పులకరించిపోతోంది. అసలే మంచు కాలం. ఆ పై పిల్లగాలి. ఇప్పుడా అరకుకు పండుగ వచ్చింది. అదేనండి హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకంగా అరకు లోయను మరింత గుర్తింపు తెచ్చేందుకు ఈ అంతర్జాతీయ బెలూన్ల పండగను చేస్తోంది. 
                     బెలూన్‌ ఫెస్టివల్‌కు 13 దేశాల నుంచి వచ్చిన 16 బృందాలు పాల్గొన్నాయి. తమ నిపుణతను చూపించాయి. జాతీయ మీడియా వారితో పాటు.. వచ్చేసింది. ఈ – ఫాక్టర్స్‌ ఎండీ సమిత్‌ గార్గ్‌, ప్రోగ్రాం మేనేజర్లు అర్ఫాన్‌ చౌదరి, రుషి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు.. సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు ఆకాశంలో హాట్ ఎయిర్ బెలూన్లు విహరించాయి. స్థానిక గిరిజనులకు కొందరికి విహరించే వీలు కల్పించడం మాములు విషయం కాదు. 
                          బెలూన్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైన వేళ ఉషా కిరణాలు వచ్చే సందర్భంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటోంది అరకు లోయ. వాటికి తోడుగా అన్నట్లు వీనుల విందైన సంగీతం, బర్నర్ల నుంచి నిప్పుల వెలుగుల శబ్దాలు తోడువుతున్నాయి. అంతే ఆ దృశ్యం చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. దక్షిణ భారతదేశంలో అంతర్జాతీయ బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహించడం ఇదే మొదటిసారి. గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా, పోయినేడు  కర్ణాటకలోని హంపి, మైసూర్, బీదర్‌లలో ఆయా రాష్ట్రాల పర్యాటకాభివృద్ధి సంస్థలు ఇలాంటి పండుగలను నిర్వహించాయి.
                       ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఇలాంటి వేడుకలను నిర్వహించి అలరించింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*