బాలయ్య, నాగ్ ల మధ్య పెరుగుతున్న అంతరం



Want create site? Find Free WordPress Themes and plugins.
నాగ చైతన్య, సమంతల వివాహ రిసెప్సెన్ లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కానీ మరో టాలీవుడ్ సింహం బాలయ్య హాజరు కాలేదు. పెళ్లికే కాదు.. విందుకు వెళ్లలేదు. నాగార్జున, బాలయ్యల మధ్య ఉన్న విభేదాలే ఇందుకు కారణమంటున్నారు. అన్న ఎన్టీఆర్, అక్కినేని కుటుంబాలు చాలా కాలం మాటలు లేకుండానే గడిపాయి. ఆ తర్వాత కలిసిపోయాయి. ఇప్పుడు వారి వారసులు బాలకృష్ణ, నాగార్జునకు మధ్య విభేదాలు పెరిగాయి. గతంలో వారిద్దరు బాగానే ఉండేవాళ్లు. ఇప్పుడు మరింతగా వారి మధ్య గ్యాప్ పెరుగుతోంది. మా మధ్య ఏం లేదని పైకి చెబుతున్నా.. వారు కలవడం లేదు. 
                            దర్శకుడు తేజతో బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించాలని అనుకున్నారు. అదే సమయంలో వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చేస్తానని ప్రకటించారు. ఆ ప్రయత్నం మానుకోమని బాలకృష్ణ వర్మకు రాయబారం పంపారు. అసలే కాస్తంత తేడాగా ఉండే వర్మ ఆయన మాటను ఖాతరు చేయలేదట. అదే సమయంలో నాగార్జున తనకు శివ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చిన వర్మతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నాగార్జున, బాలయ్యల మధ్య వైరం మరింత పెరిగిందని అంటున్నారు.
                        లోపల ఎలా ఉన్నా.. పైకి బాగానే కనిపించే వారు ఇప్పుడు అసలు మాటలే లేవు.. బయట కనిపించినా మోహం తిప్పుకుని వెళుతున్నారట. ఆర్థిక విషయాల్లో వచ్చిన విభేదాలు ఇందుకు కారణమంటున్నారు. వాస్తవంగా నాగార్జున అప్పుడప్పుడు బాలయ్య వద్ద డబ్బులు తీసుకుని ఇస్తుండేవాడు. అలానే బాలయ్య అదే పని చేసేవాడు. ఎందుకో డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో తేడా వచ్చిందట. మధ్య వారు దాన్ని పెద్దది చేసి చెప్పడంతోనే ఈ తేడాలు అంటున్నారు. 
                          చైతు, సామ్ ల వివాహ రిస్పెన్స్ కు పిలిచినా బాలయ్య గానీ.. ఆయన కుటుంబీకులు ఎవరూ వెళ్లలేదు. ఇది సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు తావిచ్చింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*