మండలి ఛైర్మన్ సీటులో ఫరూక్



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్. ఎండి ఫరూక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ఆయన ఎన్నిక బాధ్యతలను పర్యవేక్షించారు. ఆయన ఒక్కరినే నేతలు ప్రతిపాదించడంతో పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. శాసనమండలి సభ్యుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, నారాయణ, జవహర్, చినరాజప్ప, కామినేని శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
                     కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూఖ్‌ 1983లో నంద్యాల మున్సిపల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ గా ఎన్నికయ్యారు. 1985-88, 1999-2004 మధ్య కాలంలో మంత్రిగా పనిచేశారు. 1985 లో ఎన్.ఎండి ఫరూక్ తెలుగుదేశం నుండి పోటీ చేసి 8000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పార్థసారధి రెడ్డి పై గెలిచాడు. 1989 లో కాంగ్రెస్ అభ్యర్ధి రామ్ నాధ్ రెడ్డి, తెదేపా అభ్యర్ధి ఫరూక్ పై 7000 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించాడు. 1994లో ఫరూక్ తిరిగి 40వేల ఓట్ల భారీ మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్ధి మక్బూల్ హుస్సేన్  పై విజయభేరి మోగించాడు. 1999లో తెదేపా అభ్యర్థి ఫరూక్ ఇండిపెండెంట్ అభ్యర్థి, ఇప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి పై 4000 తేడాతో గెలిచి మూడుసార్లు గెలిచిన నేతగా నిలిచాడు. 
                         ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికలో తెదేపా విజయానికి తన వంతుగా కృషి చేశారు. పార్టీలో సీనియర్‌ నేత కావడం, ఉభయసభల్లో మంత్రిగా ముస్లిం మైనార్టీ నేత లేకపోవడంతో ఫరూక్ కు కలిసొచ్చింది. మరోవైపు తెదేపా సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ శాసనమండలి చీఫ్‌ విప్‌గా, డొక్కా మాణిక్య వర ప్రసాదరావు, బుద్దా వెంకన్న, రామసుబ్బారెడ్డి, షరీఫ్‌లు విప్‌లుగా నియమితులయ్యారు.
                         ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సి.ఎం చంద్రబాబునాయుడు ఫరూక్ ను నియమించడంతో ముస్లిం వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*