ఛలో సినిమాతో డిసెంబర్ 29న వస్తున్న నాగశౌర్య



Want create site? Find Free WordPress Themes and plugins.
వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు హీరో నాగశౌర్య. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రోజు రోజుకు తన రేంజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌వైభోగం”, జ్యోఅచ్చుతానంద‌” లాంటి విభిన్న క‌థాంశాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు కుర్ర హీరో నాగ‌శౌర్య. ఈ యంగ్ ఎనర్జిటిక్ హీరో వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఛలో అనే టైటిల్ ఖరారు చేశారు. 
పక్కింటి కుర్రాడు…
ప‌క్కింటి కుర్రాడు పాత్ర‌ల్లో నటించి మెప్పించాడు నాగశౌర్య. మ‌న కుటుంబంలో అబ్బాయిలా మ‌న హృద‌యాల్లో స్థానం సంపాదించాడు. అతను ఏ చిత్రం చేసినా కుటుంబ విలువ‌లు వుండేలా చూసుకుంటాడు. చ‌క్క‌టి ఎంట‌ర్ టైన్‌మెంట్ క‌థ‌లు ఎంచుకుంటారు. గత కొంతకాలంగా మంచి కథ దొరికితే సినిమా చేద్దామని భావిస్తున్న నాగశౌర్యకు వెంకీ కుడుముల కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ మొదలుపెట్టాడు. తన రేంజ్ ని పెంచుకునే దిశగా తన తల్లిదండ్రులతో కలిసి బ్లాక్ కలర్ బెంజ్ కారును ఇటీవలనే కొనుగోలు చేశాడు. కోటి రూపాయల విలువ గల బెంజ్ జి క్లాస్ ఎస్ యు వి కారు తన సొంతం కావడంతో నాగశౌర్య ఆనందానికి అవధులు లేవు. అదే ఉత్సాహంతో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఫలితంగా అవుట్ పుట్ బాగా వచ్చిందంటున్నారు దర్శక, నిర్మాతలు. ఈ మరేకు మీడియాతో తమ మనసులో మాటలను పంచుకున్నారు. 
                            హీరో నాగశౌర్య తల్లితండ్రులు ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని తెరపైకి తెస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఛలో ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగశౌర్య కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో డిసెంబర్ 18న ఛలో టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఛలో చిత్రాన్ని డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామన్నారు నిర్మాతలు. 
                             నిర్మాత ఉషా ముల్పూరి మాటల్లో చెప్పాలంటే… ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రంగా నాగశౌర్య హీరోగా వస్తోందీ సినిమా. వెంకి కుడుముల దర్శకత్వంలో మేం నిర్మిస్తున్న చిత్రానికి ఛలో అనే టైటిల్ ను ఖరారు చేశాం. ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఇండస్ట్రీ నుంచి అటు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. సినిమా కూడా అంతే బాగా వచ్చింది. టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. దర్శకుడు వెంకీ మంచి కథను కమర్షియాలిటీ మిస్ కాకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పారు. నాగశౌర్య పెర్ ఫార్మెన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తాడు. నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. అందుకే సినిమా ప్రమోషన్ ను సైతం విభిన్నంగా ప్లాన్ చేస్తున్నాం. నవంబర్ 18న ఛలో టీజర్, డిసెంబర్ 29న చిత్రాన్ని అత్యధిక ధియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. 
త్రివిక్రమ్ శిష్యుడే వెంకి కుడుమల
నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర వర్క్ చేశాను. శౌర్య నటుడిగా నాకు చాలా ఇష్టమన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. అందుకే హీరోను ఛలో చిత్రం ద్వారా డిఫరెంట్ గా ప్రజెంట్ గా చేస్తున్నాను. నాగశౌర్యను నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.  ఆంధ్రా, తమిళనాడు బార్డర్ లో జరిగే కాలేజ్ లవ్ స్టోరీ ఇది.  ఛలో చిత్ర టైటిల్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ రష్మిక మండన్న కన్నడలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీ ద్వారా ఫేమస్ అయ్యింది. చాలా బాగా నటించింది. నిర్మాతల సపోర్ట్ లేకపోతే ఇంత బాగా షూటింగ్ చేసే వాళ్లం కాదు. వారికి చాలా థాంక్స్. టీజర్ తోనే అంచనాలు పెరుగుతాయి. ఛలో ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నానని చెప్పారు దర్శకుడు వెంకీ కుడుముల.  
                       చిత్ర సమర్పకుడు శంకర ప్రసాద్ ముల్పూరి మాటల్లో… మా ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి చిత్రం ఛలో. టైటిల్ కు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో టీజర్ కు సైతం అంతే రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాం. నాగశౌర్య కు మంచి కమర్షియల్ హిట్ సినిమా అవుతుందని ధీమాగా చెబుతున్నాం. దర్శకుడు వెంకి కుడుముల కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా మొదటి చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న అందరికీ చాలా థాంక్స్ అని చెప్పారు. 
సంగీతం- సాగ‌ర్ మ‌హ‌తి, 
సినిమాటోగ్ర‌ఫి- సాయి శ్రీరామ్‌, 
నిర్మాత‌- ఉషా ముల్పూరి, 
సమర్పణ – శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి, 
ద‌ర్శ‌క‌త్వం- వెంకి కుడుముల‌
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*