టీడీపీకి గట్టి ఫైర్ బ్రాండ్ దొరికింది



Want create site? Find Free WordPress Themes and plugins.
వైఎస్ఆర్ కాంగ్రెస్ లో రోజా ఫైర్ బ్రాండ్. ఆమె మాటల ధాటిని తట్టుకోవడం అంత తేలిక కాదు. మాటల ఒరవడి బాగా ఉంటోంది. సూటిగా తగులుతోంది. అలాంటి వారి కోసమే ఎదురు చూస్తోంది టీడీపీ. పార్టీ వృద్ధ సింహం నన్నపనేని రాజకుమారి మహిళా కమిషన్ చైర్మన్ గా ఉండటంతో ఇక రాజకీయాలు అంతగా మాట్లాడటం లేదు. అయినా ఆమె పని రాజకీయంగా అయిపోయిందంటున్నారు. మరోవైపు మహిళా నాయకురాలు డా.ముళ్ళపూడి రేణుక ఉన్నా.. చాలా పద్దతిగా మాట్లాడుతోంది. రాజకీయాల్లో అంత పద్దతిగా మాట్లాడితే కష్టం. ఇక పంచుమర్తి అనూరాధ బాగానే మాట్లాడుతున్నా.. ఎక్కువగా జిల్లాకే పరిమితం అవుతారు. తన మాటల్లోను అదే చూపిస్తున్నారు. పార్టీలోను పెద్దగా ఆమెకు విలువ ఉండటం లేదంటున్నారు. గతంలో ఆమెకు మంచి అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోలేక పోయారని.. ఫలితంగా అంతగా ప్రయార్టీ ఇవ్వడం లేదంటున్నారు. మిగతా విషయాల్లోను ఆమెను అంతగా పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. 
       పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను తెరపైకి తీసుకువచ్చినా.. మంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో అసంతృప్తితో రగిలిపోతున్నారామె. పైకి చెప్పక పోయినా కొన్నాళ్ల పాటు ఆమె అలకబూనిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ రంగంలోకి వచ్చారు. అయినా ఆమెకు రాజకీయాలకు కొత్త. వీలున్నంత వరకు ఆమె కర్నూలు జిల్లా.. ఇంకా మించి నంద్యాల ఏరియాకే పరిమితమవుతున్నారు. తన పర్యాటక శాఖ పైనా పట్టు సాధించలేకపోతున్నారు. అసెంబ్లీ లో బాగానే మాట్లాడి ఆకట్టుకున్నా.. ఇంకా రాష్ట్రస్థాయిలో గుర్తింపు రాలేదు. రోజాకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను ఇప్పుడు యామిని సాదినేని అనే అమ్మాయికి అప్పగించారంటున్నారు.
      ఇటీవల టీవీ కార్యక్రమాల్లోను ఆమె ఉత్సాహంగానే పాల్గొంటున్నారు. టీడీపీ వాణి బలంగానే వినిపిస్తున్నారు. అందంతో పాటు ఆకట్టుకునే ప్రసంగాలు ఆమె సొంతం. డిబేట్ లో వాదనా పటిమ బాగానే ఉంది. యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది. తెదేపా లో సభ్యత్వం తీసుకున్నయామిని కి కేంద్ర మంత్రి సుజన చౌదరితో పాటు..సి.ఎం చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అండదండలు ఉన్నాయంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన యామిని యువ పారిశ్రామిక వేత్తగా ఎదుగుతున్నారు. గతంలో హైదరాబాద్ లో ఉండే యామిని ఇప్పుడు గుంటూరులో అందుబాటులో ఉంటూ పార్టీ సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సభ్యురాలిగా ఉన్న యామిని..దక్షిణ భారత ఎన్జీవో ట్రస్టు జాతీయ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 
                           ఏడు రాష్ట్రాలకు చెందిన ఎన్జీవోలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఎన్టీవోల్లో నకిలీలను అరికట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది. ఇటీవల విజయవాడలోను యామినీ సదస్సు నిర్వహించి ఆకట్టుకుంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న యామిని కమ్మ వనభోజన కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొని వారిలో ఉత్సాహం నింపుతోంది. అవసరమైన సందర్భాల్లో పేదలైన కమ్మ సామాజిక వర్గ కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిస్తూ తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. 
 
 
Attachments area
 
 
 
 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



1 Comment

Leave a Reply

Your email address will not be published.


*