సైరా షూటింగ్ కు సిద్దం…



Want create site? Find Free WordPress Themes and plugins.
         ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇప్పుడు అప్పుడు అంటూ వాయిదా పడుతూనే వస్తోంది. రాహుల్ సభలు వరుసగా వాయిదా పడ్డట్లు అవుతోంది. ఇప్పుడీ సినిమా షూటింగ్ తేది పై సస్పెన్స్ వీడింది. డిసెంబర్ 6న సైరా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఫుల్ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించడంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఫైట్ మాస్టర్లు యాక్షన్ సన్నివేశాలను ఇప్పటికే కంపోజ్ చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు బడ్జెట్‌కు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను తీసే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత రామ్ చరణ్. ఈ మూవీ కీలక పాత్రల్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ లు నటిస్తున్నారు. 
         ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కర్నూలు కొండా రెడ్డి బురుజును గుర్తుకు తెచ్చేలా ఒక కోట ఉంది. ఆ కోటకు సన్నని దారులు. అటు ఇటు బురుజులు. లోపల సైన్యం. బయట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అడుగులు. ఓ కోట శిఖరంపై కాలిపోతున్న ఆంగ్లేయుల జాతీయ జెండా.. దాని చుట్టూ బ్రిటిషు సైనికుల శవాలు కనిపించాయి. కోట బయట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నడుస్తూ కనపడ్డాడు. వెనుక నుంచి సైరాను చూపించారు. ‘సై.. సైరా నరసింహారెడ్డి’ అనే నినాదాలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించాయి. ఆ చిత్ర ప్రచార ఫస్ట్ లుక్ లో ఉన్న దృశ్యాలు ఇవి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. తొలిగా అనుష్కను ఈ చిత్రంలో చిరంజీవి పక్కన తీసుకోవాలనుకున్నా…ఆ తర్వాత వెనక్కు తగ్గారు. అందాల తార నయనతార చివరకు చిరుతో ఆడి పాడనుంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*