వాయిదాల బాటలో రాహుల్ పర్యటనలు



Want create site? Find Free WordPress Themes and plugins.
అదేంటో గానీ.. రాహుల్ గాంధీ ఎప్పుడు తెలుగు రాష్ట్రాల పర్యటన పెట్టుకున్నా.. అది వాయిదా పడుతూనే ఉంది. గతంలో మూడుసార్లు వాయిదా పడ్డాక మెదక్ కు వచ్చాడు రాహుల్ గాంధీ. ఆ తర్వాత అనంతపురంలో జరిగిన పర్యటన రెండు సార్లు వాయిదా పడ్డాకనే జరిగింది. ఇప్పుడు అంతే. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. వాస్తవంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటన ఈ నెల 20 లేదా 21న ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 
                         ఇందుకు ఓరుగల్లులో ఏర్పాట్లు చేశారు. కానీ హఠాత్తుగా రాహుల్‌ గాంధీ పర్యటన వాయిదా పడిందని కాంగ్రెస్ పెద్దల నుంచి ఫోన్ వచ్చింది.  గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఎప్పుడు తిరిగి ఆయన తెలంగాణలో పర్యటిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల్లో అంతర్గత విభేదాలు, సమన్వయలోపం, పార్టీపై పట్టుకోసం ఒకరిపై మరొకరు వేస్తున్న ఎత్తులే రాహుల్‌ పర్యటన వాయిదాకు కారణమనే ప్రచారం లేకపోలేదు.  
                     రాహుల్‌ పర్యటనపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. రాహుల్ పర్యటిస్తే ఆ మేరకు కొత్తగా పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డికి బలం పెరిగే అవకాశముంది. అది మిగతా వారికి ఇబ్బందిగా మారింది. అంతకు ముందు ఉస్మానియా వర్సిటీలో సభ నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అది కూడ వాయిదా పడింది. ఆ తర్వాత వరంగల్‌లోని కాకతీయ వర్సిటీ వేదికగా అనుకున్నారు. చివరకు దానిని మహబూబాబాద్‌లో గిరిజన గర్జనగా మార్చారు. కానీ అది కాదని వరంగల్‌లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సభగా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కానీ అది జరగలేదు.
                        రాహుల్‌ సభ ఇప్పట్లో ఉండే అవకాశమే లేదని చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. గుజరాత్‌ ఎన్నికలను దీనికి సాకుగా చూపిస్తున్నారని చెబుతున్నారు. సంగారెడ్డిలో సభను నిర్వహించడం వల్ల మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మంచి పేరు వచ్చింది. సంగారెడ్డి సభకు రాహుల్‌ని రాకుండా చేయాలని చాలామంది పార్టీ నేతలు ఢిల్లీకి లేఖలు రాశారు. అయినా సరే రాహుల్ అక్కడకు రావడమే కాదు.. విహెచ్ తో బ్రాస్ లెట్ ను జగ్గారెడ్డికి ఇప్పించారు. ఆ తర్వాత అది అమ్మి మిర్చి రైతులకు ఇప్పించిన సంగతి తెలిసిందే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*