మీరు ఏ పార్టీలో ఉన్నారని తలసానికి ప్రశ్న



Want create site? Find Free WordPress Themes and plugins.
శాసనమండలిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు తలసాని. అంతే కాదు.. గొర్రెలు, బర్రెలు పంపిణీ చేశాం. చేపలను పెంచుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీలను ఆదుకుంటున్నామని చెప్పారు. ఆయన మాట్లాడటం ముగిశాక పైకి లేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. అసలు మీరు ఏ పార్టీ నుంచి గెలిచారు. ఎవరి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రాజకీయ విలువలు లేని మీరు చెబితే మాలాంటి వాళ్లు వినాలా అంటూ ప్రశ్నించారు. దీంతో బిత్తరపోవడం మంత్రి వంతైయింది. తన గురించి ప్రజలందిరికీ తెలుసునన్నారు మంత్రి. 
                      వివాదం పెరిగి పెద్దది అవుతుంది. ఇక లాభం లేదనుకుని మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ సభను ఏకంగా వాయిదా వేశారు. లేకపోతే తలసానికి తలంటు పోసే కార్యక్రమం బాగానే సాగేది. మిగతా సభ్యులు ఆయన విలువల గురించి మాట్లాడేందుకు సిద్దమయ్యారు. అదే సమయంలో చాలా తెలివిగా సభను వాయిదా వేసి మండలి ఛైర్మన్ తన చాణక్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ పరువును కాపాడేందుకే ఆయన ఈ పని చేశారని అర్థమవుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*