పవన్ కు ప్రతిష్టాత్మక అవార్డు



Want create site? Find Free WordPress Themes and plugins.
జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’ను పవర్ స్టార్ అందుకోనున్నారు. ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఐ.ఇ.బి.ఎఫ్‌) ఈ అవార్డును బహుకరించనుంది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా విషయం మీడియాకు తెలిపింది. ఆ అవార్డు అందుకునేందుకు పవన్‌ కల్యాణ్ ఈనెల 16న లండన్‌ వెళ్లనున్నారు. ఈనెల 17, 18 తేదీల్లో లండన్‌లో ఏర్పాటు చేయనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు పవన్. వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టుక్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరగనున్న సభలలో పవన్‌ పాల్గొననున్నారు. 18న యూరప్‌లోని వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులతోను పవన్ సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమం వెస్ట్‌ మినిస్టర్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లోని కింగ్స్‌ మెడికల్‌ కళాశాలలో జరగనుంది.
                   తాను చేసిన సేవలకు గాను.. పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ స్థాయి అవార్డులు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో పవన్ కల్యాణ్ చొరవను అంతా మెచ్చుకుంటున్నారు. అదే కాదు.. చాలా విషయాల్లో ఆయన సేవా తీరును చూసి మెచ్చుకుంటున్నాయి పలు సంస్థలు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*