డీకే అరుణకు పీసీసీ బాధ్యతలు



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ పీసీసీ బాధ్యతలను ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మహిళకు అప్పగిస్తారట. యువరాజుకు పట్టాభిషేకం అయ్యాక జరిగే మార్పుల్లో ఇది కీలకమవుతుందనే చర్చ సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి పీసీసీ పదవిని మహిళా నేతకే కట్టబెట్టే అవకాశాలున్నాయట. గాంధీభవన్లో ఇప్పటికే ఈ విషయం పై జోరుగా ప్రచారం సాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఆ పదవి పై కన్నేసిన హైకమాండ్ మాత్రం డీకే అరుణకు ఆ పదవి ఇచ్చేందుకు సిద్దమైందనే వాదన వస్తోంది. తాము మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతాంశంగా చెప్పుకునేందుకే ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. 
                           గద్వాల జేజమ్మగా పిలుస్తారు డీకే అరుణను. పెద్దగా ఆమె ప్రయత్నాలు చేయక పోయినా అరుణ పేరు బయటికి రావడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పీసీసీ మార్పు ఉంటుందని కొందరంటుంటే ఉత్తమ్ ను అంత తేలికగా కదపరంటున్నారు. పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగిస్తే పట్టుకునేందుకు ఆమె సిద్దమయ్యారు. పీసీసీ పదవి, సీఎల్పీ నాయకుడి పదవి ఒకే జిల్లాకు ఉండడం పై గతంలోనే విమర్శలు వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు ఇద్దరు నల్గొండ జిల్లా వారే. మరోవైపు పోటీ పడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే జిల్లాకు చెందిన వారు కావడంతో ఈ సారి పాలమూరుకు ప్రాధాన్యత ఇచ్చే అంశం పై దృష్టి సారించారట కాంగ్రెస్ పెద్దలు. 
                      2014 ఎన్నికలకు ముందు తెలంగాణకు వచ్చిన రాహుల్ తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.  అవసరమైతే సీఎంను కూడా చేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ ఇచ్చిన హామీ ప్రకారం మహిళా నేతకు ప్రాధాన్యత ఇస్తే.. డీకే అరుణకే పీసీసీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పీసీసీ రేస్ లో ఉన్న మరో ఇద్దరు నేతలు జానా, కోమటిరెడ్డిల కంటే డీకే అరుణకే అవకాశాలు ఇస్తామని చెబుతున్నారు. 
                        కేంద్రంలో నిర్మలా సీతారామన్ కు రక్షణ శాఖ ఇచ్చిన మోదీ మహిళలకు ప్రాధాన్యతనిస్తోంది. ఇక టీఆరెస్ ప్రభుత్వంలో మహిళకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు కేసీఆర్. వారికి ధీటుగా మహిళను ఈ పదవిలోకూర్చో పెట్టి వారి ఓట్లను రాబట్టే అవకాశముంది. అందులోను డీకే అరుణకు కాస్తంత తెగింపు ఎక్కువే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*