ఎన్టీఆర్ ఘాట్ ను పాలతో శుద్ది చేశారు



Want create site? Find Free WordPress Themes and plugins.
       అన్న ఎన్టీ రామారావు తెలుగు జాతి చరిత్రను దశదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు. ఆత్మగౌరవ నినాదంతో  తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న సినీ నటుడు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు. తెలుగు ఖ్యాతిని ఆయనలా ప్రపంచానికి చాటిన మరో ముఖ్యమంత్రి లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి విశ్వ విఖ్యాత నట సౌర్వభౌముడు కోసం ఎన్టీఆర్ ఘాట్ ఏర్పాటు చేశారు. 
        ఇప్పుడు ఆ ఎన్టీఆర్ ఘాట్ అపవిత్రమవుతుందని ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి ఒకటే గోల చేస్తోంది. ఎన్టీఆర్‌ జీవిత గాథపై లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మ తీస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు లక్ష్మీస్ వీరగ్రంథం పేరుతో కేతిరెడ్డి జగదీష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా పై ఎన్‌టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సరే ఈ చిత్ర షూటింగ్‌ ఎన్‌టీఆర్ ఘాట్‌లో తీసేందుకు ప్రయత్నించారు. వారు అక్కడ అడుగు పెట్టి ఆ స్థలాన్ని అపవిత్రం చేశారని, అందుకే  ఘాట్‌ని పాలతో శుద్ధి చేసి పూజలు చేశారు లక్ష్మీ పార్వతి. ఎవరి అనుమతి తీసుకుని ఈ  సినిమా తీస్తున్నారని ఆమె అడిగారు. సినిమా షూటింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ సినిమా తీయడం ముమ్మాటికీ ఎన్టీఆర్ ను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీయాలనుకుంటే.. ఆ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారామె. 
     అయినా సరే సినిమాను తీసే తీరుతానని చెప్పారు మరోవైపు కేతిరెడ్డి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*