లక్ష్మీస్ వీర గ్రంథం అంటూ కేతిరెడ్డి కామెడీ చేస్తున్నారా



Want create site? Find Free WordPress Themes and plugins.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు విరుగుడుగా వస్తున్న సినిమా లక్ష్మీస్ వీరగ్రంథం. వర్మ ఒక పక్క తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండగా.. మరోపక్క ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అంటూ సినిమా తీస్తాను అని ప్రకటించాడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. అసలు అతను సినిమా తీస్తాడా లేక జోక్ చేశాడా అనుకున్నారు అంతా. సినిమా తీయడం సంగతి ఏమోగానీ.. ప్రచారం మాత్రం ఫుల్ గా వచ్చేసింది. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చిన పరిణామాలను వర్మ చూపిస్తుంటే… ఎన్టీఆర్ ను చేసుకోక ముందు ఆమె ఏం చేసిందో తన సినిమాలో చూపిస్తానని చెప్పాడు కేతిరెడ్డి. 
                            ఫలితంగా ఎవరికి వారే అసలు ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఉత్కంఠ నెలకుంది. కేతిరెడ్డి తన సినిమా స్క్రిప్టుకు పూజలు చేయడం.. సినిమాను ఎవ్వరూ అడ్డుకోలేరని ప్రకటనలు చేయడం వంటి హడావుడి చేశాడు. కానీ అసలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సినిమా షూటింగ్ ప్రారంభానికే అనుమతి తీసుకోలేదు కేతిరెడ్డి. అంతే ముందు అనుమతి తీసుకుని రండి ఆ తర్వాత మీ సంగతిని చూస్తామని చెప్పారట ఘాట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది. 
                       దీంతో చేసేదిమి లేక చెవులు జాడించుకుంటూ కేతిరెడ్డి అండ్ కో బయటకు వచ్చేసింది. నిజంగా సినిమా తీయాలనే ఆలోచన ఉంటే ముందుగా అనుమతి తీసుకునేవారు. గతంలో చాలా సినిమాల షూటింగ్స్ కు ఇలానే అనుమతి తీసుకున్నారు. కావాల్సిన షాట్స్ తీసుకుని వెళ్లారు. కానీ ఇప్పుడు పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులు ఆయన్ను అడ్డుకోవడంతో షూటింగ్ తీయకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. 
                   అసలు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా షూటింగ్ ముహూర్తపు షాట్  తీయలేక పోయాడు కేతిరెడ్డి. తన సినిమాలో లక్ష్మీ పార్వతి రోల్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను సంప్రదిస్తున్నామని చెప్పారు. ఐశ్వర్యరాయ్, సన్నీ లియోన్.. వంటి వాళ్లతోను సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పేశారు కేతిరెడ్డి. అది విన్న వాళ్లంతా కామెడీ చేయడం లేదుగదా అనుకుంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



1 Comment

Leave a Reply

Your email address will not be published.


*