హైపర్ ఆదికి కత్తి మహేష్ వార్నింగ్



Want create site? Find Free WordPress Themes and plugins.
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో హైపర్ ఆది జోక్ లు పేలతాయి. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద పంచ్ లు వేస్తుంటారాయన. ఇది కేవలం ప్రేక్షకులను నవ్వించడానికే తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదని తరచూ చెబుతుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కామెంట్ల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
                    తన డైలాగ్ లతో క‌డుపుబ్బా న‌వ్వించే హైప‌ర్ ఆదిపై సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి నిప్పులు చెరిగాడు. ఆ షోలో హైపర్‌ ఆది స్కిట్‌లో భాగంగా ఒక డైలాగు పేల్చాడు. వివాహం అనేది సినిమా తీసినంత కష్టం అని, కానీ ప్రేమ మాత్రం ముందు పొట్ట‌ వేసుకొని, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ అని డైలాగ్ వేశాడు. రివ్యూలు రాసే వారిలో పొట్ట ఉండి, బట్టతల ఉన్న వ్యక్తి కత్తి మహేష్ ఒక్కరే. తన గురించే ఇలాంటి మాటలు మాట్లాడరని ఫీలయ్యాడు కత్తి మహేష్. ఆ డైలాగు గురించి తెలుసుకున్న మ‌హేశ్ క‌త్తి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
                      ‘అవును, నాకు పొట్ట ఉంది, బట్ట ఉంది’ అని వ్యాఖ్యానించాడు. మనుషులు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారని చెప్పాడు. ఒకరు పొడుగ్గా, ఇంకొకరు పొట్టిగా, ఒకరు నల్లగా, ఇంకొకరు తెల్లగా ఉండొచ్చ‌ని, కొంద‌రికి నత్తి ఉండొచ్చ‌ని, కొంద‌రికి త‌న‌లా బట్టతల ఉండొచ్చని చెప్పాడు. సంస్కారం ఉండే వారు ఎవరు ఇలాంటి కామెంట్లు చేయరన్నారు మహేష్. అదే సమయయంలో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. యాక్టింగ్ సరిగా చేతగాని.. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ప్రశ్నించడం తప్పు కాదన్నారు. ఇందుకు పవన్ అభిమానులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారాయన. 
                    ఇతరులను కించపరిచేలా కామెడీ చేయడం మంచిది కాదని చెప్పారాయన. బిగ్ బాస్ షో తర్వాత కత్తి మహేష్ బాగా పాపులర్ అయ్యాడు. అందుకే ఆయన ఏది చెప్పినా జనాల్లోకి వెళుతోంది. ఇప్పుడు కత్తి మహేష్ డైలాగ్ లకు హైపర్ ఆది ఎలా స్పందిస్తాడో మరి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*