సంక్రాంతికి ముందే జనసేన జనయాత్ర



Want create site? Find Free WordPress Themes and plugins.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనయాత్రకు జనవరిని ఫిక్స్ చేశారు. ఆ నెల మొదట వారంలో ఇందుకు ముహుర్తం చూశారని చెబుతున్నారు. జగన్ ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో తాను యాత్ర చేసేందుకు సిద్ధమని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అది బస్సుయాత్రనా… పాదయాత్రనా అనేది ఇంకా తేలలేదు. తాను పాదయాత్ర చేస్తే జనాలను కంట్రోల్ చేయడం కష్టమని.. అందుకే ప్రత్యేక రథం తయారు చేసే పనిలో ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నమాట. 
                    తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు చేస్తున్నారు. పర్యటన ఎన్ని రోజులు చేయాలి. ఎక్కడ మొదలు పెట్టాలి. ఎక్కడ ముగించాలి. పాదయాత్రనా.. బస్సు యాత్రనా.. అనే అంశాల పై ఇంకా క్లారిటీ లేదు. పాదయాత్ర చేస్తే కంట్రోల్ చేయడం కష్టమని జనసేన పార్టీ కోర్ కమిటీ నేతలు భావిస్తున్నారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే పూర్తి వివరాలు అందజేశారు. పవన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ బస్సు యాత్ర ద్వారానే ప్రజల్లోకి రావాలనుకుంటున్నారట. 
                      ముందుగా ఏపీలో ఆ తర్వాత తెలంగాణలో పర్యటించాలని భావిస్తున్నారు పవన్. పార్టీ నిర్మాణం, జిల్లాలో నేతల ఎంపిక, పార్టీ సిద్ధాంత నిర్మాణం, సమన్వయకర్తల నియామకం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమన్వయకర్తల ఎంపిక పూర్తి కావొస్తోంది. ఆ తర్వాత మూడు రోజులు పాటు శిక్షణ ఇస్తారు. డిసెంబర్ చివరి నాటికి  పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం జరుగుతోంది. జనవరి మొదటి వారంలో పవన్ తన యాత్రకు శ్రీకారం చుడతారని జనసేన వర్గాలు తెలిపాయి. మరోవైపు జనసేన ప్లీనరీ నిర్వహించాలని పవన్ భావిస్తున్నారు. ఈ ప్లీనరీ తర్వాతే యాత్ర చేయటం మంచిదని కొందరు నేతలు చెప్పారు. అందుకే ఈ యాత్రలోనే పవన్ పార్టీ ప్రధాన ఎజెండాను కూడా ప్రకటిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. యాత్ర ముగిశాక ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడే అవకాశముంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*