బూతు సినిమాలతో బేజారుWant create site? Find Free WordPress Themes and plugins.
          సినిమా పేరు దేవీశ్రీ ప్రసాద్. ఆ పదం వింటే ఎన్నో మచి హిట్ పాటలు గుర్తుకు వస్తాయి. కానీ కాన్సెప్ట్ మాత్రం శవంతో సెక్స్ దృశ్యాలట. వినడానికే ఈ పదం ఇబ్బందిగా ఉంది. కానీ ఆ సినిమా ప్రమోషన్ కోసం వాడిన పదం ఇదే. అంతే యూత్ లో ఇప్పుడు ఈ సినిమా పై ఒకటే చర్చ. అదేంటి. అసహజ శృంగారం ఉంటుందా అనే ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. సినిమాల ప్రచారం కోసం ఇలాంటి వెర్రి బాగుల వేషాలు వేయడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే శృతి మించి డబుల్ మీనింగ్ డైలాగ్ లు సినిమాల్లోకి వచ్చేశాయి. కుటుంబ సభ్యులు వెళ్లి సినిమాలు చూసే రోజులు పోతున్నాయి. ఫలితంగా అసలు ధియేటర్లకే ఏళ్ల తరబడి వెళ్లని వారు ఎక్కువ మందే ఉంటున్నారు. సెల్ పోన్లలో నెట్ వచ్చాక అసలు ధియేటర్లకు వెళ్లే వారి శాతం గణనీయంగా తగ్గుతోంది. 
          ఇదే సమయంలో అశ్లీల దృశ్యాల పేరుతో వచ్చి సినిమాలకు లోటు లేదు. అది కాదన్నట్లుగా ఇప్పుడు ఏకంగా బూతు సినిమాలను రంగంలోకి దింపడం వివాదాన్ని రేపుతోంది. చిన్న సినిమా దేవిశ్రీ ప్రసాద్. చిన్న నటీనటులతో చేసిన సినిమా ఇది. పైశాచికత్వం అంటే ఇదేనేమో. స్వామి రారా’ ఫేం పూజా రామచంద్రన్‌ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కానీ ఇలాంటి విచిత్ర ప్రమోషన్లు, టీజర్లు ఇచ్చిన వారిని జైల్లో పెట్టాలని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాం గోపాల్ వర్మలా..ప్రమోషన్ కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారా..లేక సినిమాలో ఇలాంటి సీన్లు ఉన్నాయా అనేది ఉత్కంఠను పెంచుతోంది. 
           భూపాల్ రాజు, పూజ రామచంద్రన్ తో పాటు..ధన్ రాజ్, మనోజ్ నందం, పోసాని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా..శ్రీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

  1. anni dayyala cinumalu, boothu dialogula cinemalu yekkuvayyayi. TVllo poteelu padi boothu dialogula karyakramalu yekkuvayyayi. censor board TVlaku kuda pettali.

Leave a Reply

Your email address will not be published.


*