చంద్రబాబు చారిత్రక తీర్మానం



Want create site? Find Free WordPress Themes and plugins.
పేదలకు ఇళ్ల నిర్మాణం వేగవంతం:
దేశంలో ఇదే విచిత్ర కోణం. అసెంబ్లీలో అధికార పక్షమే విపక్షంగా మారింది. మంత్రులను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు. ఇందులో భాగంగా సొంత ఇల్లు నిర్మాణం సంగతి అడిగారు నేతలు. ఇందుకు సి.ఎం చంద్రబాబునాయుడు లెక్కలతో సహా సభలోనే చెప్పారు. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు కల అని, ఆ కలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అసెంబ్లీ ఇళ్ల నిర్మాణంపై చర్చ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు విశాఖలో 50 వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో మరో 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ఇంటి స్థలం ఇచ్చి క్రమబద్ధీకరించాల్సి ఉందని సీ.ఎం తెలిపారు.
                       కాంగ్రెస్‌ పాలనలో 14.40 లక్షల ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. గతంలో జరిగిన ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వివరించారు. ఏడాదికి మూడు సార్లు గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు బాబు. పట్టణాల్లో 5,39,586 ఇళ్లు కడుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో మరో 13,06,555 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నాటికి 18,45,841 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉందని, 19 లక్షల ఇళ్లు నిర్మించి ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. మరోవైపు రూ.56వేల కోట్లు ఖర్చుపెట్టి పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని, హుద్‌హుద్‌ బాధితుల కోసం 9,170 ఇళ్లు పూర్తిచేస్తున్నామని వివరించారు. హుద్‌హుద్‌ వల్ల దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ.10వేలు చొప్పున విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*