అరికెపూడి గాంధీకి చేదు అనుభవం



Want create site? Find Free WordPress Themes and plugins.
        తెలంగాణలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఒక్కరోజే హైదరాబాద్ మోతీనగర్, ప్రగతినగర్, కేబిహెచ్, కుత్భుల్లాపూర్ లలో జరిగిన కమ్మ సంఘం వన భోజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణలో 16 లక్షల మంది కమ్మ ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఐదున్నర లక్షల మంది ఉన్నారని..మిగతా వారిలో ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటున్నారని ప్రస్తావించారు. కమ్మ జాతి కోసమే ఆరుగురం ఎమ్మెల్యేలము పార్టీ మారినట్లు చెప్పారు. ఆయన మాటలకు మోతీనగర్, కుత్భుల్లాపూర్ లలో పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సభ్యురాలు సామినేని యామిని, ప్రముఖ సామాజిక సేవకురాలు సత్యవాణిలు బాగానే మాట్లాడారు. తమ జాతితో పాటు..మిగతా వారిని గౌరవించాలని చెప్పారు.
          కానీ ప్రగతినగర్ లో మాట్లాడే సందర్భంలో ఎమ్మెల్యే గాంధీకి అడ్డుతగిలారు చాలా మంది కమ్మ సామాజిక వర్గం నేతలు. కమ్మ జాతి కోసం ఇలా పార్టీ మారామని చెప్పడం బాగోలేదన్నారు. ఆ సమావేశంలోనే జై ఎన్టీఆర్. జై తెలుగుదేశం వంటి నినాదాలు వినిపించాయి. ఫలితంగా ఆయన ఇబ్బంది పడ్డారు. చివరకు సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది. కమ్మవారిని జాగ్రత్తగా చూసుకుంటామని సి.ఎం కేసీఆర్ హామీనిచ్చారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీ మారినట్లు చెప్పారు అరికపూడి గాంధీ. మాకు మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదర్శమని చెప్పారు. అంతే కాదు..పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కమ్మ సామాజిక వర్గం వారికి ఇచ్చారని గుర్తు చేశారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*