ఫోన్ కొట్టండి.. రూ.500 తీసుకోండి..



Want create site? Find Free WordPress Themes and plugins.
పట్టుకుంటే పట్టుచీర. టీవీల్లో మహిళలను ఆకట్టుకునేందుకు చేసే కార్యక్రమం ఇది. చాలా మందికి దీని సంగతి తెలుసు. కానీ ఇప్పుడు పట్టుకుంటే పట్టుచీర కాదు.. రూ.500 అంటోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌ను బెగ్గింగ్ ఫ్రీ సిటీగా మార్చే ప్రయత్నం చేస్తోంది సర్కార్. ఇందులో భాగంగా  జైళ్ల శాఖ వినూత్న విధానాన్ని ఎంచుకుంది. బజార్లో ఎవరైనా అడుక్కునే వారు కనిపించగానే జైళ్ల శాఖ కంట్రోల్‌ రూంకు సమాచారం ఇవ్వాలి. అలా ఫోన్ చేసి పట్టిస్తే చాలు వారికి రూ.500 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. డిసెంబరు 25 నుంచి దీన్ని అమలు చేస్తామన్నారు స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ సంపత్‌.
                       ఇప్పటి వరకు భాగ్యనగరంలో 235మంది పురుషులు, 125 మంది మహిళలను అలానే పట్టుకుని చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ప్రత్యేక శిబిరాలు, ఆనందాశ్రమాలకు తరలించారు. వారికి అక్కడే ఆవాసం కల్పిస్తున్నారు. గత నెల 20న ప్రారంభించిన ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో 250 మందిని వారి కుటుంబీకులకు అప్పగించారు. మరోవైపు వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వేలిముద్రలు, ఆధార్‌ నంబర్లు సేకరించారు. ఇంకోసారి వారు ఈ వృత్తిలోకి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనుండటం మంచిదే. యాచకుల్లో నైపుణ్యాలను గుర్తించి అవసరమైతే వారికి శిక్షణ ఇచ్చి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోలు బంకులు, ఇతర చోట్ల ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. 
                  త్వరలోనే ఫోన్ నెంబర్ తో పాటు.. రూ.500ను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. అందుకే రెడీగా ఉండండని చెబుతున్నారు అధికారులు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*