బెల్ట్ షాపులు ఉంటే ఫోన్ చేయాలట



Want create site? Find Free WordPress Themes and plugins.
        బీరు ఆరోగ్యానికి మంచిదని ప్రకటించి అప్పట్లో సంచలనం రేపారు మంత్రి జవహర్. ఆయనే ఇప్పుడు మరో ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా బెల్టుషాపులు ఉన్నట్లు సమాచారం అందిస్తే అరగంటలో మూసివేయిస్తామన్నారు మంత్రి జవహర్. ప్రతి గ్రామంలోను బెల్ట్ షాపులు ఉన్న సంగతి మంత్రికి తెలియదా..మరీ చోద్యం కాకపోతేనే అంటున్నారు జనాలు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో బెల్ట్‌ షాప్స్‌ రద్దు చేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. ఎక్కడైనా బెల్ట్‌ షాపులు ఉంటే 1100కి కాల్‌ చేయాలని ప్రజలకు సూచించారు. బెల్టుషాపులు కాంగ్రెస్‌ హయాంలో పురుడు పోసుకున్నాయని ప్రస్తావించారు. మద్యం కల్తీ చేసినట్టు తెలిస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని మంత్రి అన్నారు. ప్రజల ఫిర్యాదులతో 600 మద్యం షాపులు మరోచోటుకి తరలించామన్నారు. గంజాయిని సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జవహర్‌ చెప్పడం విశేషం. 
        బెల్ట్ షాపులు కాదు..గుడి, బడి దగ్గరలో ఉన్న మద్యం షాపులను తొలగించాలని కోరినా పట్టించుకోని పరిస్థితి. అలాంటిది బెల్ట్ షాపులు వెంటనే తీసేస్తామని చెప్పడం విడ్డూరంగానే ఉంది. అసలు అవి పెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు  లంచాల మత్తులో జోగుతున్నా..చర్యలు తీసుకోవడం చేతగాని స్థితిలో కొత్త సంగతి చెప్పడం చర్చనీయాంశమైంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*