కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు



Want create site? Find Free WordPress Themes and plugins.
        కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు చంద్రబాబు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలకు తెగించి పలువురిని కాపాడిన ఇద్దరిని అభినందించారు. వారికి రూ.5 లక్షలను బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం తరపున ఇస్తున్నట్లు చెప్పారు. అంతే కాదు..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.1 లక్ష పరిహారంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. 
       వాకర్స్ క్లబ్ సభ్యులు అంతా సేవా దృక్పధంతో వచ్చారు. వారంతా పవిత్ర కార్యం కోసం వెళుతున్నారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. వారి ఆత్మ శాంతికి సభ మౌనం పాటించింది. మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాస్‌, అఖిలప్రియ హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. బోటు నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు పెట్టాం. ముగ్గురు బోటు సిబ్బంది ఆచూకీ తెలియడం లేదు. వాహనాలకు మాదిరిగానే బోట్లనూ నియంత్రించే విధంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తాం. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులు లేవు. ప్రైవేటు బోటు సిబ్బంది వారిని ఎక్కించుకుని నదిలోకి తీసుకెళ్లడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. 
         పవిత్ర సంగమం సమీపంలో బోటు కుదుపులకు లోను కావడంతో డ్రైవర్‌ ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. దీంతో పర్యాటకులంతా ఓ వైపునకు చేరుకున్నారు. ఇదే పడవ ప్రమాదానికి దారి తీసింది. బోటులో లైఫ్ జాకెట్లు లేవు. ప్రమాద నివారణకు తీసుకుంటున్న చర్యలు నామ మాత్రంగా ఉన్నాయి. బోటు ప్రయాణించిన తీరు చూస్తుంటే డ్రైవర్‌కు ఆ మార్గంపై సరైన అవగాహన లేదు. ఇలాంటివి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు సి.ఎం చంద్రబాబు. 
         అనుమతి లేకుండా బోటు నదిలోకి తీసుకెళ్లవద్దని చెప్పినా..వినకుండా ఇలా చేశారు. అందుకే ప్రమాదం చోటు చేసుకుందని ప్రస్తావించారు. అసెంబ్లీలో విపక్షం లేకపోవడంతో సి.ఎం చంద్రబాబునాయుడు, టీడీపీ సభ్యులే బోటు ఘటన పై మాట్లాడారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*