కేంద్రం వంచిస్తే బాబు మోయాల్సిందే!



Want create site? Find Free WordPress Themes and plugins.

అసలే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఎలాగ అని నానా పాట్లు పడుతూ.. నానా రకాల ఆలోచనలతో సాగుతున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి పోలవరం ఒక అదనపు భారంగా మారబోతున్నది. ప్రత్యేకహోదా కావొచ్చు, ఆర్థిక మినహాయింపుల ప్యాకేజీలు కావొచ్చు.. రాష్ట్రానికి పెట్టుబడులను వెల్లువెత్తించగల ఎలాంటి వెసులుబాటును కేంద్రం ఇవ్వకపోగా.. ఏదో ఒక రీతిగా పెట్టుబడులను మాత్రం సాధించుకు రావాలని చంద్రబాబునాయుడు అలుపెరగకుండా తిరుగుతూనే ఉన్నారు. వీలైనంత వరకు సాధించుకు వస్తున్నారు.

ఇదంతా ఒకవైపు జరుగుతోంటే.. సాయం చేయకపోగా, నిచ్చెన ఎక్కుతున్న వాడిని కాళ్లు పట్టుకుని కిందికి లాగినట్లుగా కేంద్రం వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రానికి ఎంతో కీలకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో.. వారు ఎన్ని రకాల వంచనలకు పాల్పడుతున్నారనే సంగతిని ప్రజలు గమనిస్తున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అనే హామీ విభజన చట్టం ఆధారంగానే మనకు దక్కిన హక్కు. నిజానికి అది పాత ప్రభుత్వం చట్టంచేసినప్పుడే సూత్రీకరించిన విషయం. కాకపోతే.. ఇటీవల ప్యాకేజీ ప్రకటిస్తున్నాం అంటూ జైట్లీ నిరాశ పరచిన రోజున.. ఏదో తవ్వి తలకెత్తేస్తున్నట్లుగా పోలవరం ప్రాజెక్టు కు కాగల ప్రతిరూపాయి ఖర్చు మేమే భరిస్తాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలో అనేక డొంకతిరుగుడు మార్గాలు అనుసరిస్తోది.

భూ సేకరణతో  మాకు సంబంధం లేదు, ఫలానా పనులకు మేం డబ్బులివ్వం అంటూ నాటకాలు ఆడడం ఒక ఎత్తు, వారు విధిగా డబ్బులు భరించాల్సి వచ్చే ప్రాజెక్టు పనుల విషయంలో ఇదివరకే ఇదే కేంద్రం ఆమోదించిన డిజైన్లకే ఇప్పుడు బ్రేకులు వేస్తూ కాఫర్ డ్యాం వద్దే వద్దు.. మరో రకంగా చేద్దాం మళ్లీ అధ్యయనం చేద్దాం వంటి పడికట్టు మాటలు మాట్లాడుతున్నారు. ఇదంతా కేంద్రం వంచనాశిల్పం అని తెలుసుకోవాలి.

అయితే కేంద్రం ఎంత మోసం చేసినా.. ఆ భారం రాష్ట్రం మీదనే పడే ప్రమాదం ఉంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాలి. అందుకు చంద్రబాబు కూడా మానసికంగా సిద్ధపడుతున్న వాతావరణం కనిపిస్తోంది. కేంద్రం ఇవ్వకపోయినా నిదులు మనమే పెట్టుకోవాలి అంటూ చంద్రబాబు చెప్పడం దీనికి సంకేతమే. అయితే.. అసలే నిధుల్లేని రాష్ట్రం పోలవరం వంటి భారీ ప్రాజెక్టు విషయంలో కాగల వ్యయాన్ని ఎలా భరిస్తుంది? అది ఎప్పటికి పూర్తవుతుంది? అనేదే అందరి మదిలో మెదలుతున్న ప్రశ్నగా ఉంది. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*