పొరుగు దేశంలో ట్రంప్, మోదీ కలయిక



Want create site? Find Free WordPress Themes and plugins.
       ఊహించని సంఘటన ఇది. ఫిలిప్పీన్స్‌ పర్యటనలో ఉన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. తన వియత్నాం పర్యటన ముగించుకుని అక్కడకే చేరారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అధికారులు సమాచారం ఇచ్చి పుచ్చుకున్నారు. ఫలితంగా పెద్ద దేశాల నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఇండియా-ఏషియాన్‌ సదస్సుతో పాటు తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు మోదీ ఫిలిప్పీన్స్‌కు చేరినసంగతి తెలిసిందే. ఆసియాన్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సుకు ఆయన హజరయ్యారు. దక్షిణ చైనా సముద్ర వివాదం, అణుపరీక్షలతో ప్రపంచదేశాలకు తలనొప్పిగా మారిన ఉత్తరకొరియా గురించి చర్చలు జరుపుతున్నారు. మరోవైపు మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియన్‌ ప్రధాని మాల్కమ్‌ టర్నబుల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇండియా-ఆసియాన్‌ సమావేశంలో పాల్గొని ప్రసంగించే మోదీ పలు కీలకాంశాలను ప్రస్తావించనున్నారు. 
         అమెరికాలో కాకుండా అటు ట్రంప్, ఇటు మోదీ కలవడం ప్రపంచ దేశాల నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఇలానే పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి షరీప్ ఇంట్లో జరిగిన విందుకు హాజరయ్యారు మోదీ. ఇప్పుడు ఇలా బయటకు చెప్పకుండా ట్రంప్ ను కలవడం మిగతా వారిని ఆశ్చర్యపరిచింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*