భారత రాయబారిని కలసిన కువైట్ తెలుగు సంఘాల ఐక్యవేదిక



Want create site? Find Free WordPress Themes and plugins.

కువైట్ తెలుగు సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కుదరవల్లి సుధాకర రావు గారి అధ్వర్యములో కువైట్ లొ ఉన్న నలుబది తెలుగు సంఘాల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు బుధవారము భారాత రాయభారి కార్యాలయపు అధికారులను కలశారు.

కువైట్ లో ఉన్న నలుబై తెలుగు సంఘాలు చేతులు కలిపి ఒక ఐక్యవేదిక గా ఏర్పడి కువైట్ లో వున్న తెలుగువారు ఎవరయిన కషాలలో వుంటే వారికి మేమున్నాము అనే భరోసా కల్పించి అన్నివిధాలుగా సహాయపడి వారిని ఆదుకోవాలనే లక్షముతో ముందుకు రావటం జరిగినది. కన్వీనర్ సుధాకర రావు అన్ని సంఘాల అధ్యక్షులను DCM రాజగోపల్ సింగ్ గారికి పరిచయం చేసి ఆయా సంఘాలు చెస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను గూర్చి వివరించారు. తెలుగు లలిత కళా సమితి అధ్యక్షులు కొత్తపల్లి మోహన్ బాబు గారు ఈ ఐక్యవేదిక భవిష్యత్ ప్రణానికలను భారత రాయభారి కార్యాలయ అధికారులకు వివరించారు.

రాయలసీమ గల్ఫ్ అస్సోసియేషన్ అద్యక్షులు గంగాధర్ గారు ప్రస్తుతం ఉన్న కొన్ని సమస్యలను అధికారుల ద్రుస్టికి తెచ్చి వారిసహాయాన్ని కోరారు. ప్రవసాంద్ర అధ్యక్షులు మాలేపాటి సురేష్ బాబు గారు, మనకడప సేవాసమితి అధ్యక్షులు సుబ్బు గారు, అమ్మ హెల్పింగ్ హంద్స్ అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్ గారు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. చివరగా DCM గారిని ఘనంగా సన్మానించారు.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*