భారతీయులు అందంగా లేరా…



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆడవారు అందంగా ఉండరని అతడు.. సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం పాత్రతో చెప్పిస్తాడు దర్శకుడు. హీరోయిన్ త్రిష అందంగా లేదని మహేష్ బాబు అంటాడు. అందుకే వర్షం పడితే ఆడవాళ్లు అందంగా ఉన్నట్లు. లేకపోతే అందానికి వారు పనికిరారని చెబుతాడు. చివరకు నిమిషం వ్యవధిలోనే వాన చినుకులు పడతాయి. అంతే ఆడవాళ్లంతా సంతోషంతో చిందులు తొక్కి మరీ సంబరం చేసుకుంటారు. అది సినిమా. కానీ నిత్య జీవితంలోను అలాంటి మాటలే వచ్చాయి. ఆడవారిలో అందం చూడాలంటే భారతీయులు పనికి రారని ఓ అంతర్జాతీయ సర్వే చేసిన సంస్థ పేర్కొంది. ముగ్ధ మనోహర రూపంలో ఉండే భారతీయులు అందానికి ఎంత మాత్రం పనికిరారట. 
                      అమాయకత్వం, ఆత్మవిశ్వాసం వంటి నవరసాలు కలిగలిసి ఉండటం భారతీయ మహిళ సొంతం. ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, యుక్తాముఖీ, దియా మీర్జా, డయానా హెడెన్, దీపికా, ప్రియాంక చోప్రా, సోనమ్ వంటి వారు అంతర్జాతీయ ఉత్సవాల్లో మెరిసిపోతారు. వారిని చూసేందుకు పురుష పుంగవులు ఎగబడటం కొత్తేం కాదు. అసలు అందం అంటే భారతీయ మహిళదే. కానీ భారత దేశంలోనే ఆకర్షణీయమైన అందగత్తెలు లేనే లేరట. అతివలే కాదు.. అందమైన మగవారు కూడా లేరని.. మిస్ ట్రావెల్ అనే ఒక అంతర్జాతీయ డెస్టినేష‌న్ డేటింగ్ సైట్ జరిపిన సర్వేలో తేలింది. వారు చెప్పిందేంటంటే ఆర్మేనియా దేశ మహిళలు, ఐర్లాండ్ దేశ పురుషులు అత్యంత సెక్సీయెస్ట్ పర్సన్స్ అని ఈ సర్వే ద్వారా తేల్చారు. 
                       మొత్తం 1,10,000 మంది అమెరికన్లు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. వారు ఎంచుకున్న ప్రకారం ఆర్మేనియా దేశ మహిళలు మొదటి ప్లేస్ ను దక్కించుకోగా, బార్బడోస్, అమెరికా, కొలంబియా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫిలిప్సీన్స్, బల్గేరియా, లెబ‌నాన్ దేశ మహిళలు ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నారు. అసలు మొదటి పది స్థానాల్లో ఎక్కడా భారతీయ మహిళలే లేరు. ఇక పురుషుల్లో ఐర్లాండ్ మగవారు సెక్సీ గా ఉంటారని ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా… ఆస్ట్రేలియా, పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్, స్కాట్లాండ్, ఇటలీ, నైజీరియా, డెన్మార్క్, స్పెయిన్ దేశ పురుషులు తర్వాత స్థానాల్లోఉన్నారు. మన పొరుగు దేశం.. పాకిస్తాన్.. కు మూడో స్థానం దక్కగా.. భారతీయులకు అసలు చోటే లేదు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*