పవన్ టైమ్ మారుతోంది…



Want create site? Find Free WordPress Themes and plugins.
పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోని తొలిపాటను పూర్తిగా విడుదల చేశారు. దర్శకుడు త్రివిక్రమ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని తొలిపాట లిరికల్‌ వీడియోను ప్రేక్షకులకు అందించారు. ‘బైటికొచ్చి చూస్తే టైమేమో 3’o క్లాక్‌..’ అంటూ సాగుతోంది పాట. పాట లిరిక్ కు తగ్గట్లుగా కార్టూన్స్ వేసి చూపించారు. పాట విడుదలకి ముందే ట్విట్టర్‌లో ఈ సాంగ్ పై బాగా ప్రచారం జరిగింది. పవన్‌కల్యాణ్‌కి జోడీగా కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్న ఈ సినిమా పై భారీగానే అంచనాలున్నాయి. ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను ఈసినిమాకు పరిశీలిస్తున్నారు. దసరాకు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ కానీ టీజర్‌ కానీ విడుదల చేయాలనుకున్నా కుదరలేదు. ఇప్పుడు త్రివిక్రమ్‌ పుట్టినరోజుకి చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు. హారిక-హాసిని క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2018 జనవరిలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు ఈ సినిమా హిట్ తో పవన్ కల్యాణ్ అభిమానులకు మంచి జోష్ వచ్చే అవకాశముంది. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*