ముఖ్యమంత్రులిద్దరు సైలెంట్



Want create site? Find Free WordPress Themes and plugins.
      రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల సి.ఎంలు కేసీఆర్, చంద్రబాబులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మీ పై వ్యతిరేకత లేదు. నాకు శత్రువు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పిన మాట. అంతర్గతంగా జరిగిన చర్చల్లో అదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారట. ఫలితంగా రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఒక్క మాట అనలేదు. మరోవైపు రేవంత్ రెడ్డి పార్టీ పై స్వామిభక్తి చూపించారు. అతను కాకుండా పార్టీ నుంచి మరెవరు వెళ్లినా పార్టీకి వచ్చే నష్టం లేదని చెప్పేవారనేది నిజం. అంతే కాదు..తెలంగాణ టీడీపీ నేతలు ఎవరూ కామెంట్ చేయలేదు. 
     ఇక టీఆర్ఎస్ నేతలకు పై నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై దారుణంగా విరుచుకుపడుతున్నా…ఖండించడం లేదు. ఒకవేళ అలా ఖండిస్తే రేవంత్ రెడ్డి మరింత పెద్ద వాడు అవుతాడని భావించవచ్చు. కానీ అదే సమయంలో పార్టీకి డ్యామేజ్ పెరుగుతుందన్నది వాస్తవం. అసెంబ్లీలో మాదక ద్రవ్యాల అంశం ప్రస్తావనకు రాలేదని చెప్పిన రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. అయినా ఒక్కరు మాట్లాడలేదు. అధికార పార్టీకి చెందిన నేతల పై ఆరోపణలు చేసినప్పుడు కచ్చితంగా ఖండించాల్సిందే. కానీ కేసీఆర్ గానీ..ఆ పార్టీ కీలక నేతలు ఎవరూ అందుకు సమాధానం చెప్పలేక పోయారు. ఇది ఆసక్తికరమే. 
         మరోవైపు రేవంత్ రెడ్డి సి.ఎం చంద్రబాబునాయుడుతో రాజీధోరణితోనే వెళ్లాడు. వెళుతూ వెళుతూ పార్టీ మీద అభాండాలు వేయడం ఎందుకని ఆలోచించాడు. పార్టీని వ్యక్తులు వీడినా వచ్చిన ఇబ్బంది తాత్కాలికమే. ఎన్టీఆర్, ములాయంలకు వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు వచ్చాయి. అయినా పార్టీ తిరిగి అదే గాడిలో నిలబడింది. ఇప్పుడు అంతే. రేవంత్ రెడ్డి లాంటి వారుపార్టీ మారినా..ఇబ్బంది లేదనే అభిప్రాయంలో ఉన్నారు. కానీ కేసీఆర్ వర్గం ఈ విషయంలో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే విషయం పై తర్జన భర్జనలు పడుతోంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*