కోట్ల వస్తే ఇబ్బంది లేదంటూనే చురకలంటించిన కేఈ



Want create site? Find Free WordPress Themes and plugins.
కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ మార్పు పై తొలిసారిగా మాట్లాడారు డిప్యూటీ సి.ఎం కేఈ కృష్ణమూర్తి. కోట్ల రాక పై ఏం చేద్దామని అడిగారు సి.ఎం చంద్రబాబునాయుడు. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కానీ వారికి ఎమ్మెల్సీ కావాలట.. మంత్రి కావాలట.. మరో సీటు కావాలనే ప్రతిపాదన పెట్టారు. పార్టీ అధినేత ఏం చెప్పినా చేసేందుకు సిద్దమని చెప్పారాయన. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల వల్ల అభివృద్ధి ఆగిందని విమర్శించారు కేఈ. 
                          బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ అభివృద్ధి కోసం బాగా పర్యటన చేశారు. జనాలు తమ కోసం బాగా చేస్తున్నాడని మెచ్చుకున్నారు. కానీ ఓటింగ్ వద్దకు వచ్చేసరికి చాలా దారుణంగా స్పందించారు. ర్యాలీలకు వచ్చిన జనం.. ఓట్ల రూపంలోకి వచ్చేసరికి ఉండరని చెప్పారు. అందుకే మంచి పార్టీ ఉంటే ప్రజలు వారంతట వారే వచ్చి ఓట్లేస్తారని చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడు బీసీలను బాగా ఇబ్బంది పెట్టారన్నారు. జగన్ ఇంకా రాజకీయంగా ఎదగాలి. కాసేపు బీసీ గర్జన అంటారు.. మరికాసేపు హోదా అంటారు.. ఇంకాసేపు దాన్ని పక్కనపెడతానంటాడు. క్లారిటీ లేకుండా రాజకీయాలు చేస్తే ఇలానే ఉంటుందన్నారు కేఈ. తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు తమవైపే ఉన్నారని ప్రస్తావించారు కేఈ.   
                    కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి రావడంతో కోట్ల టీడీపీలోకి రాకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. అందుకే కేఈ తన మాటల్లో కోట్లను విమర్శించాడని చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ నుంచి బయటకు రావడం కోట్లకు ఇష్టం లేదన్నారు. రాజకీయంగా కోట్ల, కేఈ కుటుంబాల మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిందే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*