జగన్ పార్టీ ఎమ్మెల్యే 420



Want create site? Find Free WordPress Themes and plugins.
      వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి వందల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించి..సింగపూర్ కు వెళ్లారని..ఆరోపించారు. ఆధారాలుగా కొన్ని డాకుమెంట్లను బయట పెట్టారు. 2003 సెప్టెంబరు 13న సోమిరెడ్డి మలేసియాకు వెళ్లినట్లు, అక్కడ ఆయనకు స్థిరాస్తులు, బ్యాంకుల్లో నగదు ఉన్నాయని తెలిపారు. థాయ్‌లాండ్‌లో సోమిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు పవర్‌ప్రాజెక్టు ఉందని ఎమ్మెల్యే కాకాణి చేసిన మరో ఆరోపణ. 2016 డిసెంబరులో కాకాణి మీడియా సమావేశంలోనే ఈ పత్రాలను చూపించారు. 
          తన పై ఆరోపణలు రాడవంతో సోమిరెడ్డి ఘాటుగానే స్పందించారు. డిసెంబరు 28న నెల్లూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవన్నీ నకిలీ పత్రాలని, తనకు విదేశాల్లో ఆస్తులు లేవని, దీనిపై విచారణ జరపాలని కోరారు. సాక్షాత్తు ఇమిగ్రేషన్‌, ఫోరెన్సిక్‌ నిపుణులు రంగంలోకి దిగారు. కాకాణి చేసిన ఆరోపణల పై విచారణ జరిపారు. అందులో ఒక్క నిజం కూడా లేదని తేల్చారు. సర్వేపల్లి ఎమ్మెల్యే బయటపెట్టిన పత్రాలన్నీ నకిలీవేనని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ధ్రువీకరించింది. అంతే కాదు…నెల్లూరు మొదటి తరగతి నాల్గో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులోను ఈ చార్జిషీట్‌ ను దాఖలు చేశారు. 
       2003 సెప్టెంబరు 13న సోమిరెడ్డి మలేసియా వెళ్లినట్లు ఆధారాల్లేవని.. అసలు ఆయన పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయనేలేదని ఇమిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. చిరంజీవి అనే వ్యక్తితో కలిసి, లక్ష రూపాయలు ఇచ్చి, ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసారని తెలుస్తోంది. చిరంజీవితో పలు సార్లు ఫోన్‌లో మాట్లాడడం, మెసేజ్‌లు ఇవ్వడం వంటి సమాచారాన్ని పోలీసులు సేకరించి చార్జిషీటులో పొందుపరిచారు. ఫలితంగా ఇప్పుడు కాకానినే కాదు..వైకాపా నేతలు బుక్ అయ్యారు. ఒక అబద్దాన్ని నిజం చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్ అవడం హాట్ టాపికైంది. అందుకే తమ పైన కాదు..ఎమ్మెల్యే పై 420 కేసు బుక్ చేయాలని సోమిరెడ్డి వర్గం డిమాండ్ చేస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*